ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘డయాఫ్రమ్‌వాల్‌’ జనవరిలోనే..

ABN, Publish Date - Nov 24 , 2024 | 04:43 AM

పోలవరం ప్రాజెక్టును నిర్ణీత కాలంలో పూర్తి చేయాలంటే 2025 జనవరి మొదటి వారంలో డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందేనని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు,

నిర్మాణ బాధ్యతలు బావర్‌కు అప్పగించండి

కేంద్రానికి అంతర్జాతీయ నిపుణుల నివేదిక

అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును నిర్ణీత కాలంలో పూర్తి చేయాలంటే 2025 జనవరి మొదటి వారంలో డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందేనని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి అమెరికా, కెనడాలకు చెంది న అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 11న నివేదికను అందజేసింది. వచ్చే ఏడా ది జనవరి తొలివారంలో డయాఫ్రమ్‌వాల్‌ నిర్మించేందుకు వీలుగా, మొయిన్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రదేశాన్ని పూర్తిగా బావ ర్‌ సంస్థకు అప్పగించాలని స్పష్టం చేసింది. ఇదే సమయం లో డయాఫ్రమ్‌వాల్‌కు సమాంతరంగా ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎ్‌ఫ)ను నిర్మించేందుకు వీలుగా భారీ రాళ్ల ను సేకరించి ఉంచాలని సూచించింది. పోలవరం ప్రధాన డ్యామ్‌ నిర్మాణం కోసం కొండను తవ్వారని గుర్తు చేసిన నిపుణుల కమిటీ.. రాళ్లను, మట్టినీ కలిపి ఒక చోట గుట్టలా డంపింగ్‌ చేయడాన్ని తప్పుబట్టింది. రాళ్లను వేరు చేయాలని సూచించింది. ఈ కార్యక్రమాన్ని తక్షణమే ప్రారంభించాలని కేంద్రానికి సూచించింది. పోలవరం ప్రధాన డ్యామ్‌ పూర్తయ్యేంత వరకూ రోజువారీ, వారంతపు, నెలవారీ సమీక్షలు నిర్వహిస్తూ ఉండాలని పేర్కొంది. పోలవరం ప్రధాన డ్యామ్‌ నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.

Updated Date - Nov 24 , 2024 | 04:43 AM