chandrababu: ‘జగన్‌కు బాగా అర్థమైంది’
ABN, Publish Date - Mar 30 , 2024 | 05:36 PM
ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ అధికార పీఠం ఎక్కిన తర్వాత ఆయన వ్యవహరించిన తీరుపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు.
నాయుడుపేట, మార్చి 30: ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ (YS Jagan) అధికార పీఠం ఎక్కిన తర్వాత ఆయన వ్యవహరించిన తీరుపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu) నిప్పులు చెరిగారు. ప్రజాగళం (prajagalam) కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ మద్యపాన నిషేధం అన్నాడు.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ జగన్ ఆ పని చేయలేదన్నారు. పైగా 60 రూపాయిలు ఉండే మద్యం బాటిల్ ధరను రూ. 200 రూపాయిలకు పెంచిన ఘనత ఆయనే దక్కుతోందన్నారు. మందు బాబుల బలహీనత ఈ జగన్‌కు బాగా అర్థమైందని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
అందుకే భూం భూం, ప్రెసిడెంట్ వంటి నాసి రకం జే బ్రాండ్ల విక్రయిస్తూ.. జలగ మాదిరిగా మీ రక్తాన్ని తాగడానికి ఈ ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నాడని మండిపడ్డారు. ఇక్కడ దొరికే మందు.. పక్కనే ఉన్న తమిళనాడులో దొరకదని.. అదే తమిళనాడులో దొరికే మద్యం.. దేశమంతా దొరుకుతున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం లభ్యం కాదన్నారు. దీని వెనుక ఉన్న చిదంబర రహస్యం ఏమిటని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్జానం ఉంటే ఇలా చేస్తాడా? అని ప్రజలను చంద్రబాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు. మరోవైపు.. ఇతర రాష్ట్రాల్లో ఆన్ లైన్ పేమెంట్లు గుగూల్ పే, పేటీఎం వంటివి ఉన్నాయని.. కానీ ఏపీలో మాత్రం నేరుగా నగదు తీసుకుని మద్యం విక్రయాలు చేస్తున్నారని గుర్తు చేశారు.
అంటే జగన్ మీ నగదును దోచేస్తున్నాడని చెప్పారు. ఈ మద్యం తాగడం వల్ల మీ ఆరోగ్యం పాడైపోయిందని .. అలాగే మీ జేబులు సైతం గుల్ల అయినాయన్నారు. ఆడబిడ్డల మంగళసూత్రాలు తెగిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఈ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కి మీ మీద కనికరం లేదన్నారు. అందుకే వైయస్ జగన్‌ను ఇంటికి సాగనంపండంటూ ప్రజలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. అన్ని రాష్ట్రాల్లో ఉన్న నాణ్యమైన మద్యం పాలసీ.. అందుబాటులోకి తీసుకు వస్తానని ఈ సందర్బంగా ప్రజలకు హామీ ఇచ్చారు.
అలాగే మద్యం రేట్లు సైతం నియంత్రణ చేస్తామని చెప్పారు. ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ ఉచిత ఇసుక ప్రజలకు ఇస్తానని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇసుకను సామాన్యుడికి దొరకుండా చేశాడని.. దీంతో నేడు ఇసుకే బంగారమైపోయిందన్నారు. నేడు ట్రాక్టర్ ఇసుక రూ.5 వేలు అయిందని గుర్తు చేశారు. దీంతో భవన నిర్మాణ కార్మికులు జీవనోపాధి లేకుండా ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్నీ ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Pawan Kalyan: వర్మతో పవన్ కల్యాణ్ భేటీ.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ..
Devineni Uma: ఏపీ రాజధాని ఏదో జగన్ చెప్పగలరా..?
Updated Date - Mar 30 , 2024 | 05:50 PM