ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: మహిళలకు నెలకు రూ.1500.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ABN, Publish Date - Nov 12 , 2024 | 08:33 PM

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వరుసగా అమలు చేస్తూ వస్తుంది. ఇప్పటికే పలు హామీలను అమలు చేస్తుంది. ఇటీవల ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసింది.

AP CM Chandrababu Naidu

అమరావతి, నవంబర్ 12: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయింపులు చేసింది. అందులోభాగంగా 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ. 1500 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. అందుకోసం ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.3341.82 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది.

Viral Video: గుర్రమెక్కిన పిల్లోడు.. ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా..


మహిళలకు ఆర్థిక సహకారం పేరుతో బడ్జెట్‌లో ఈ నిధులను కేటాయించారు. ఎస్సీ మహిళలకు రూ.1198.42 కోట్లు, ఎస్టీ మహిళలకు రూ. 330.10 కోట్లు, బీసీ మహిళలకు రూ. 1099. 78 కోట్లు, మైనార్టీలకు రూ. 83.79 కోట్లు, ఆర్థికంగా వెనుక బడిన వారికి రూ. 629. 37 కోట్ల నిధులను కేటాయించారు.

Also Read: Attack on Collector: రౌడీయిజం, గుండాయిజం చేస్తే.. తాట తీస్తాం


ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వరుసగా అమలు చేస్తూ వస్తుంది. ఇప్పటికే పలు హామీలను అమలు చేస్తుంది. ఇటీవల ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసింది.

Also Read: ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య

Also Read: కాబూలీ శనగలు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


అలాగే ఈ ఏడాది మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సైతం ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు గత జగన్ ప్రభుత్వ హయాంలో.. పలు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు కోట్లాది రూపాయిలు ఇచ్చింది. అదీ కూడా అప్పు చేసి మరి ఇలా ప్రభుత్వం ఇవ్వడంతో.. ఖజానా ఖాళీ కావడం దేవుడెరుగు. ఈ పథకాల కోసం తెచ్చిన నగదుకు వడ్డీలకు వడ్డీలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం వద్ద పైసా నగదు లేన్న సంగతి అందరికీ తెలిసిందే.

Also Read: Attack on Collector: వికారాబాద్ ఘటనపై ఏడీజీ కీలక నివేదిక

Also Read: ఐఏఎస్ ప్రశాంత్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం


అలాంటి వేళ.. చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది. ఆ క్రమంలో ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు వెళ్తుంది. మరోవైపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ నవంబర్ మాసాంతంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో కొత్త బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. అందులోభాగంగా సూపర్ సిక్స్ పథకాలతోపాటు రాష్ట్రాభివృద్ధికి సైతం భారీగా నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 12 , 2024 | 08:33 PM