ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: సర్వీసూ ఓ ప్రొడక్టే!

ABN, Publish Date - Dec 12 , 2024 | 03:41 AM

విభిన్నంగా ఆలోచిస్తూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లాల సమగ్రాభివృద్ధి కోసం కలెక్టర్లు చొరవ చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు.

సేవారంగానికి విస్తృత ప్రచారం కల్పించండి

వినూత్నంగా ఆలోచిస్తేనే అభివృద్ధి సాధ్యం

ఒక్క వ్యవసాయంతోనే ప్రగతిని సాధించలేం

కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఉద్బోధ

అమరావతి, డిసెంబరు11 (ఆంధ్రజ్యోతి): విభిన్నంగా ఆలోచిస్తూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లాల సమగ్రాభివృద్ధి కోసం కలెక్టర్లు చొరవ చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. సేవలరంగం కూడా ఓప్రొడెక్టేనని (ఉత్పత్తి), దానిని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. బుధవారం అమరావతి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కలిసి సీఎం పాల్గొన్నారు. విజన్‌ ఆంరఽధ-2047 డాక్యుమెంట్‌లో పొందుపరిచిన జిల్లాల వారీ జీడీపీఎ్‌సల వివరాలను సదస్సులో చంద్రబాబు వెల్లడించారు. పరిశ్రమలతోపాటు సర్వీసు రంగం అభివృద్ధి చెందిన జిల్లాల జీడీపీఎస్‌ అధికంగా ఉన్నదని వివరించారు. ‘‘2022-23లో విశాఖపట్నం జీడీపీఎస్‌ రూ. 1,19,268 కోట్లు. అది 2028-29 నాటికి రూ.2,64,781 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. పరిశ్రమలు, సర్వీసు రంగాల భాగస్వామ్యం అక్కడి అభివృద్ధిలో అధికంగా ఉండటమే దీనికి కారణం. విశాఖకు గూగుల్‌ లాంటి కంపెనీలు వస్తే అది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే...ట్రైసిటీ హబ్‌గా (తిరుపతి, కృష్ణపట్నం, శ్రీసిటీ, నెల్లూరు, చెన్నై) ఉన్న తిరుపతికి రవాణా సహా పలు అవకాశాలు ఉండడం వల్ల ఆ జిల్లా జీడీపీఎస్‌ రూ.67,487 కోట్లు నుంచి 2028-29 నాటికి 1,69,469 కోట్లకు చేరుకుంటుంది’’ అని చంద్రబాబు అంచనా వేశారు.

నీళ్లు ఉన్న జిల్లాలు వెనక్కి, నీళ్లు లేని జిల్లాలు ముందుకి రావడం చూస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘‘వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉద్యానవన పంటలను ప్రోత్సహించడం కారణంగా నీళ్లు లేని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలు బాగా అభివృద్ధి చెందాయి. అక్కడకు నీళ్లు కూడా తీసుకెళితే ఆ ప్రాంతాలు మరింత బ్రహ్మాండంగా ప్రగతిని అందుకుంటాయి. నీళ్లు సమృద్ధిగా ఉండే ఉమ్మడి పశ్చిమగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు పారిశ్రామిక పురోగతి లేకపోవడంతో వెనుకబడిపోయాయి. పరిశ్రమలు రాకపోవడం, సేవారంగం అభివృద్ధి చెందకపోవడం, సంప్రదాయంగా వస్తున్న వరి, కొబ్బరి పంటలనే ఇప్పటికీ సాగు చేస్తుండటమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో జిల్లాల జీడీపీఎ్‌సలో అనంతపురం రాష్ట్రంలో 6వ స్థానానికి, కడప 11వ స్థానానికి చేరుకున్నాయి’’ అని వివరించారు. ఒక్కోసారి ఆర్థికవ్యవస్థ లో అవకాశాలు ఒక్కసారిగా పెరుగుతాయనీ, ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం మన దృష్టికోణాన్ని మార్చుకోవాల్సి వస్తుందని చంద్రబాబు వివరించారు. వ్యవసాయం ఒక్కటే ఏ రాష్ట్రాన్నీ, జిల్లానూ ముందుకు తీసుకెళ్లలేదన్నారు.


దీనికి అదనంగా సేవల రం గాన్ని పెంచితే పర్యాటకంలో 20 శాతం వృద్ధి లభిస్తుందని తెలిపారు. ‘‘రాష్ట్రంలో అదనంగా 500 హోటల్స్‌ రావాల్సి ఉం ది. పర్యాటక రంగంలో 53 వేల రూములు కట్టాల్సి ఉంది’’ అన్నారు. అభివృద్ధిని వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు ప్రభావితం చేస్తాయని చెప్పారు. నికర అదనపు విలువ (జీవీఏ) వ్యవసాయంలో 4,27,961 కోట్లు, పరిశ్రమల్లో 3,14,856 కోట్లు, సర్వీసు రంగంలో 4,80,576 కోట్లు(జీవీఏ).. ఇలా మొత్తం 12,23,691 కోట్లు నమోదైందని సీఎం చెప్పా రు. విజన్‌ ఆంరఽఽధ-2047 డాక్యుమెంట్‌లో 50 శాతం వృద్ధిరేటును లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు తెలిపారు. ‘‘ప్రస్తుతం 3000 వేల డాలర్ల లోపే జీడీపీఎస్‌ ఉంది. 23 సంవత్సరాల కాల వ్యవధిలో 15 రెట్లు అభివృద్ధి, అంటే 42వేల డాలర్లకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందిం చాం. కాబట్టి ప్రణాళికలు, కార్యాచరణలో వినూత్నంగా, విభిన్నంగా ఆలోచించాలి. తలసరి ఆదాయం పెరిగితేనే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఈ దిశగా కలెక్టర్లు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలి’’ అని సీఎం ఆదేశించారు.

ప్రతి సమస్యా పరిష్కరించాల్సిందే!

లేదంటే ప్రభుత్వంపై నమ్మకం పోతుంది

కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు వెల్లడి

‘ప్రజలు మాకు మ్యాండేట్‌ ఇచ్చి గెలిపించారు. కాబట్టి ప్రజల నుంచి వస్తున్న ప్రతి సమస్యనూ పరిష్కరించాల్సిందే. పరిష్కరించనివి.. వివరించి చెప్పాలి. ఆ కారణాలను పోర్టల్‌లో నమోదు చేయాలి. దీనిపై ఏవిధంగా చేస్తారో వర్కవుట్‌ చేయండి’’ అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల సమావేశంలో ‘ఫిర్యాదుల పరిష్కారం’పై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ...‘‘జూన్‌ నెల నుంచి నవంబరు వరకు 1.69 లక్షల ఫిర్యాదులు వస్తే.. వాటిలో 30 శాతం పెండింగులో ఉన్నాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి’ అని అన్నారు.

‘‘నేను 40 ఏళ్లుగా కలెక్టర్ల పనితీరును పరిశీలిస్తున్నాను. వారి వ్యవహారశైలి మారాలి. బ్రిటీ్‌షవాళ్లు పోతూపోతూ చాలా నియంత్రణలు పెట్టిపోయారు. వారు రెవెన్యూకు అప్పట్లో అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. వారి దృష్టిలో కలెక్టరు.. రెవెన్యూ వసూలుచేసే అధికారి. అయితే, ఈ భావన మారాలి. కలెక్టర్లు అన్నిరకాల బాధ్యతలను పంచుకోవాలి. శిక్షణాకాలంలోనే ఇందుకు బీజం పడాలి’’

- సీఎం చంద్రబాబు

Updated Date - Dec 12 , 2024 | 03:41 AM