ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చంద్రబాబుతోనే యువత భవిత

ABN, Publish Date - Apr 13 , 2024 | 06:01 AM

యువతే ఈ రాష్ట్ర భవిష్యత్‌ అని, వారి భవిష్యత్‌ బాగుండాలంటే చంద్రబాబు సీఎం అవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు...

వినుకొండ, విస్సన్నపేట పర్యటనలో భువనేశ్వరి

నేడు తిరువూరులో ‘నిజం గెలవాలి’ ముగింపు సభ

ఎ.కొండూరు/విస్సన్నపేట, బొల్లాపల్లి, ఏప్రిల్‌ 12 : యువతే ఈ రాష్ట్ర భవిష్యత్‌ అని, వారి భవిష్యత్‌ బాగుండాలంటే చంద్రబాబు సీఎం అవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట, ఎ.కొండూరు మండలాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో బాణావతు ధనమ్మ, మూటం శ్రీనివాసరావు, ఎ.కొండూరు మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో గుగులోతు బాబ్లా, పోలిశెట్టిపాడులో బల్లిపోగు నాగరాజు కుటుంబాలను ఆమె పరామర్శించి ధైర్యం చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై ఆ నలుగురు చనిపోయిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కక్షపూరిత రాజకీయాల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి విముక్తి కలగాలన్నా, యువత భవిష్యత్‌ బాగుపడాలన్నా కూటమి అభ్యర్థులందరినీ గెలిపించేందుకు యువతతోపాటు ప్రతిఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తిచేసి పల్నాడు ప్రాంతం ప్రజలకు సాగు, తాగునీరు అందించేది చంద్రబాబేనని భువనేశ్వరి అన్నారు. వినుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా లోకేశ్‌ ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఇచ్చిన హామీని వచ్చే ఎన్నికల్లో గెలిచిన అనంతరం నెరవేరుస్తారని తెలిపారు. బొల్లాపల్లి మండలం రేమడిచర్లలో ఆమె పర్యటించారు. అక్రమ కేసులో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన పార్టీ కార్యకర్త షేక్‌ హుస్సేన్‌ కుటుంబాన్ని పరామర్శించారు. నిజం గెలవాలి ముగింపు సభ శనివారం తిరువూరులో జరగనుంది.

Updated Date - Apr 13 , 2024 | 06:01 AM

Advertising
Advertising