CM Chandrababu: సీఎంగా బాధ్యతలు చేపట్టాక రేపు తొలిసారి ఢిల్లీకి చంద్రబాబు.. ఎందుకంటే?
ABN, Publish Date - Jul 02 , 2024 | 06:51 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) దేశ రాజధాని ఢిల్లీ వెళ్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హస్తినకు వెళ్తుండడంతో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) దేశ రాజధాని ఢిల్లీ వెళ్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హస్తినకు వెళ్తుండడంతో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు సాయంత్రం 5 గంటలకు ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, తదితర అంశాలపై కేంద్రంలోని ఎన్డీయే నాయకులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. గత ఐదేళ్లలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద చంద్రబాబు ప్రస్తావించనున్నారు.
కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్రంలో పాలనను గాడిలో పెట్టడంపై సీఎం చంద్రబాబు పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. గత ప్రభుత్వ పాలన వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర పురోగతి కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న అన్ని అంశాలపై ఫోకస్ చేస్తున్నారు.
Updated Date - Jul 02 , 2024 | 06:51 PM