CM Chandrababu: ఫలించిన చంద్రబాబు ప్రయత్నం.. విజయవాడకు పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
ABN, Publish Date - Sep 02 , 2024 | 10:04 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం ఫలించింది. విజయవాడకు పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. నిన్న కేంద్రంతో చంద్రబాబు సహాయక చర్యల విషయమై మాట్లాడారు. పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీకి పంపించాలని కోరారు.
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం ఫలించింది. విజయవాడకు పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. నిన్న కేంద్రంతో చంద్రబాబు సహాయక చర్యల విషయమై మాట్లాడారు. పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీకి పంపించాలని కోరారు. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు కేంద్రం బోట్స్‌ను పంపించింది. మరోవైపు లుధీయానా నుంచి ఆర్మీ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో బొట్లతో విజయవాడ వరద ప్రాంతాల్లోకి వెళ్లాయి. సుమారు 100 మందితో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులను వేగవంతంచేయడం జరిగింది. పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం సూచించారు. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ళ బాటిల్స్‌ను ప్రభుత్వం అందిస్తోంది.
ప్రైవేటు హోటల్స్, దుర్గ గుడి, అక్షయ పాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం సమకూర్చుతోంది. ముంపు ప్రాంతాల్లో మరోసారి పర్యటనతో సహాయక చర్యలను చంద్రబాబు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి నిరంతర సమీక్షలు, మానిటరింగ్ సత్ఫలితాన్నిస్తున్నాయి. చంద్రబాబు సూచనలతో అధికార యంత్రాంగం సైతం చురుకుగా పనులు నిర్వర్తిస్తోంది. నిరంతర పర్యవేక్షణతో ఉదయం వరకూ ఆహారం సిద్ధం చేసి అధికారులు పంపిణీ చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో రాత్రంతా తిరగడంతో వేగం పుంజుకుని సహాయక చర్యలను చేపట్టడం జరిగింది. మొత్తానికి చంద్రబాబు అయితే రాత్రి నుంచి విజయవాడలోనే ఉంటూ నిద్రాహారాలు మాని మరీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
అలాగే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. రాత్రి ఇంటింటికీ వెళ్లి మరీ చంద్రబాబు బాధితులను పరామర్శించారు. జనాలకు తామున్నామనే ధైర్యం కల్పించారు. మరోవైపు శేష సాయి కల్యాణ మండపంలో లక్షల మంది వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ రంగం, విజయవాడ హోటల్స్ ఫుడ్ తయారు చేస్తున్నాయి. లక్ష మందికి టిఫిన్.. లక్ష మందికి భోజనాన్ని హోటల్స్ యంత్రాంగం అందిస్తోంది. రాత్రి నుంచి హుటాహుటిన వరద ప్రాంతాలకు ఫుడ్ సప్లై చేస్తోంది. ఇలా ఎవరికి తగినట్టుగా వారు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
Updated Date - Sep 02 , 2024 | 10:50 AM