ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఔషధ నిరోధకతకు ‘ఫేజ్‌ థెరపీ’తో చెక్‌

ABN, Publish Date - Nov 17 , 2024 | 04:12 AM

మానవాళికి ఆరోగ్య ముప్పుగా పరిణమిస్తున్న యాంటీబయోటిక్‌ ఔషధ నిరోధకతను (ఏఎంఆర్‌) ఎదుర్కొనేందుకు పాత వైద్య విధానమైన బ్యాక్టీరియోఫేజ్‌ థెరపీ చక్కగా ఉపయోగపడుతుందని ఇన్‌ఫెక్షన్‌ వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ కే కల్యాణ్‌ చక్రవర్తి తెలిపారు.

పాత వైద్య విధానంతో చక్కటి ఫలితాలు

ఇన్‌ఫెక్షన్‌ వ్యాధుల స్పెషలిస్ట్‌ కల్యాణ్‌ చక్రవర్తి

గుంటూరు మెడికల్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): మానవాళికి ఆరోగ్య ముప్పుగా పరిణమిస్తున్న యాంటీబయోటిక్‌ ఔషధ నిరోధకతను (ఏఎంఆర్‌) ఎదుర్కొనేందుకు పాత వైద్య విధానమైన బ్యాక్టీరియోఫేజ్‌ థెరపీ చక్కగా ఉపయోగపడుతుందని ఇన్‌ఫెక్షన్‌ వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ కే కల్యాణ్‌ చక్రవర్తి తెలిపారు. గుంటూరు అరండల్‌పేటలోని హెల్ప్‌ హాస్పిటల్‌లో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. మనిషిలో జబ్బులకు కారణమయ్యే బ్యాక్టీరియాలు యాంటీబయోటిక్‌ మందులను తట్టుకొని జీవిస్తున్నాయని, దీనివల్ల చిన్న వ్యాధులకు సైతం చికిత్స చేయడం కష్టంగా మారుతోందని వివరించారు. ఈ సమస్య వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మృతిచెందుతున్నారని తెలిపారు. ‘బ్యాక్టీరియాలు, వైర్‌సలు, ఫంగ్‌సల వల్ల వ్యాధులు మనిషిపై దాడి చేస్తాయి. అయితే ఈ బ్యాక్టీరియాలపై దాడిచేసి వాటిని పూర్తిగా భక్షించే వైర్‌సలు ప్రకృతిలో ఉన్నాయి. వీటినే బ్యాక్టీరియోఫేజ్‌గా పిలుస్తాం’ అని తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఫేజ్‌ థెరపీని వినియోగించినట్లు తెలిపారు. తమ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌ అసిస్టెడ్‌ నిమోనియా (ఎసింటోబ్యాక్టర్‌ లోఫి)తో బాధపడుతున్న 60 ఏళ్ల మహిళకు ఫేజ్‌ థెరపీ చేపట్టామని, మూడు రోజుల్లోనే నిమోనియా నుంచి కోలుకుందన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 04:12 AM