ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Children Bank Of India: నకిలీ నోట్ల దందా.. అడ్డంగా పట్టించిన ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’

ABN, Publish Date - Apr 13 , 2024 | 09:16 AM

ఈమధ్య కాలంలో నకిలీ నోట్ల దందా బాగా పెరిగిపోయింది. వెబ్ సిరీస్‌లతో పాటు సోషల్ మీడియాలో నకిలీ నోట్లను ఎలా తయారు చేయాలన్న వీడియోలు విస్తృతంగా అందుబాటులో ఉండటంతో.. వాటిని చూసి దుండగులు నకిలీ నోట్లు తయారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు సైతం అదే పని చేశారు.

ఈమధ్య కాలంలో నకిలీ నోట్ల (Fake Notes) దందా బాగా పెరిగిపోయింది. వెబ్ సిరీస్‌లతో పాటు సోషల్ మీడియాలో నకిలీ నోట్లను ఎలా తయారు చేయాలన్న వీడియోలు విస్తృతంగా అందుబాటులో ఉండటంతో.. వాటిని చూసి దుండగులు నకిలీ నోట్లు తయారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు సైతం అదే పని చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందవచ్చన్న ఉద్దేశంతో.. నకిలీ నోట్ల వ్యాపారాన్ని మొదలుపెట్టారు. కానీ.. చివరికి ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (Children Bank Of India) వారిని అడ్డంగా పట్టించేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Mallikarjuna Kharge: ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్.. అసలేమైందంటే?


చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన గంగరాజు గతంలో ‘స్టాక్ బ్రోకరేజీ’ వ్యాపారం చేశాడు. అయితే.. అందులో భారీగా నష్టపోవడంతో, డబ్బు సంపాదన కోసం మరో మార్గం కోసం అన్వేషించాడు. ఈ క్రమంలోనే.. నకిలీ కరెన్సీ చలామణీతో సులువుగా డబ్బు సంపాదించవచ్చని తెలుసుకున్నాడు. పైగా.. ఎన్నికల సమయంలో (Lok Sabha Polls 2024) రాజకీయ నాయకులు రహస్యంగా నగదు పంపిణీ చేస్తుంటారని తెలిసి, ఇదే సరైన సమయమని భావించాడు. తన ఆలోచనని అమలు చేయాలని నిర్ణయించి, తన స్నేహితుడు అభినందన్‌తో చేతులు కలిపాడు. నకిలీ నోట్లు ఎలా తయారు చేయాలని శోధించడం మొదలుపెట్టగా.. మహారాష్ట్ర చెందిన సచిన్‌ పవార్‌, సురేష్‌ పవార్‌లు తమ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన నకిలీ కరెన్సీ వీడియో వీరి కంటపడింది. అది చూసిన తర్వాత వారిని వీడియోకాల్ ద్వారా సంప్రదించారు. వారితో మాట్లాడిన తర్వాత.. రూ.1 వెయ్యికి రూ.5 వేల చొప్పున కరెన్సీ నోట్లు లభిస్తాయని నిర్ధారించుకున్నారు.

Janasena: ఇన్ని రోజులు ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క

దీంతో.. గంగరాజు, అభినందన్ కలిసి మహరాష్ట్రలోని చద్వేల్‌ పట్టణానికి వెళ్లారు. అక్కడ రూ.3.5 లక్షల అసలు నగదు అందించి.. రూ.17 లక్షల నకిలీ నోట్లు తీసుకున్నారు. తమిళనాడులోని తిరువూరుకి చెందిన రవి అనే వ్యాపారికి ఆ నకిలీ నోట్లు అందించి, తమ వ్యాపారం మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ.. అది ఆ ఒప్పందం కుదరలేదు. గురువారం హైదరాబాద్‌కు చేరుకొని.. ఒక రోజు హోటల్‌లో బస చేశారు. శుక్రవారం మైలార్‌దేవుపల్లి మెహఫిల్‌ హోటల్‌కు చేరుకుని.. నకిలీ నోట్ల సరఫరాకు ప్రయత్నించారు. ఈ విషయం శంషాబాద్‌ SOT పోలీసులకు తెలియడంతో.. మైలార్‌దేవుపల్లి పోలీసుల సహకారంతో స్పాట్‌కు చేరుకొని, ఆ ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ నోట్లపై ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అనే ముద్రణే వీరిని అడ్డంగా బుక్ చేయించింది. నిందితుల నుంచి రూ.6.62 లక్షల కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Apr 13 , 2024 | 09:19 AM

Advertising
Advertising