రెవెన్యూ సదస్సులకు 947 అర్జీలు
ABN, Publish Date - Dec 22 , 2024 | 02:12 AM
రెవెన్యూ సదస్సుల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన 43 గ్రామసభల్లో 947 అర్జీలు వచ్చాయని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
తిరుపతి(కలెక్టరేట్), డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సుల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన 43 గ్రామసభల్లో 947 అర్జీలు వచ్చాయని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. అందులో అసైన్మెంట్ ఆఫ్ హౌస్ సైట్స్‌పై-213, అసైన్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్‌పై 97, క్యాస్ట్ వెరిఫికేషన్ 11, రెవెన్యూపై 21, రీసర్వేపై 13, భూ కబ్జాలపై 2, 22ఏకి సంబంధించి 6, ఆర్‌వోఆర్‌పై 473, ఇతర విషయాలకు సంబంధించి 84 వచ్చాయని వివరించారు. 39 అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.
Updated Date - Dec 22 , 2024 | 02:12 AM