గోకులం షెడ్ల పురోగతిపై దృష్టి
ABN, Publish Date - Dec 23 , 2024 | 01:27 AM
ఇటీవల పడిన వర్షాలతో పశువులు అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాయి.పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం తలపెట్టిన గోకులం షెడ్ల నిర్మాణంలో క్షేత్రస్థాయి సిబ్బంది అలసత్వంతో ఆశించిన పురోగతి లేదు.
పశుసంవర్థక శాఖ జేడీ ప్రభాకర్
చిత్తూరు సెంట్రల్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఇటీవల పడిన వర్షాలతో పశువులు అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాయి.పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం తలపెట్టిన గోకులం షెడ్ల నిర్మాణంలో క్షేత్రస్థాయి సిబ్బంది అలసత్వంతో ఆశించిన పురోగతి లేదు.ఈ విషయాలపై పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రభాకర్ స్పందన....
? గోకులం షెడ్ల నిర్మాణంలో పురోగతి
! జిల్లాకు 2131 షెడ్లు మంజూరు కాగా, 1981 గ్రౌండింగ్ చేశాం. ఇందులో 166 పూర్తి చేయగా, మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. ఇందుకు జిల్లాకు రూ.50 కోట్ల నిధులు వచ్చాయి. షెడ్ల నిర్మాణాలపై తరచూ పర్యవేక్షిస్తున్నాం. పాడి రైతులతో మాట్లాడి నిర్మాణాల్లో వేగం పెంచుతాం.
? ఇటీవలి వర్షాలతో పశువులకు వ్యాధులు ప్రబలాయి
! గొర్రెలు, మేకల్లో చిటుకు వ్యాధితో అబార్షన్ అవుతుంది. దీని నివారణకు తరచూ పర్యవేక్షిస్తున్నాం. పశువుల్లో తరచూ వచ్చే గాలికుంటు వ్యాధి నివారణకు ఇప్పటికే ఒక విడత టీకాలు వేశాం. మరోసారి వచ్చే ఏడాది త్రైమాసికంలో వేస్తాం.ఎక్కడైనా ముద్ద చర్మ వ్యాధిని గుర్తించగానే, ఇతర పశువులకు సోకకుండా కట్టడి చేసున్నాం.
?గొర్రెల పెంపకందారుల సంఘాలకు అందుతున్న ప్రయోజనాలు
! సంఘాలకు అవసరమైన మేరకు గొర్రెల భద్రత కోసం షెడ్ల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నాం. జిల్లాలో 73 షెడ్లు మంజూరు కాగా 71 గ్రౌండింగ్ చేశాం. అవసరమైన మేరకు వ్యాధుల నివారణకు టీకాలు వేస్తున్నాం.
? రైతుల ఇంటి వద్దకు పశువైద్య సేవలు
! జిల్లాలో నియోజకవర్గానికి రెండు యానిమల్ హెల్త్ అంబులెన్స్‌లున్నాయి. ఎక్కడైనా పశువులకు వ్యాధులున్నట్లు రైతులు 1962 నెంబరుకు ఫోన్ చేస్తే, వారి ఇంటి వద్దకు వెళ్లి సేవలందిస్తున్నాం. రైతు సేవా కేంద్రాల్లో 289మంది యానిమల్ హెల్త్ అసిస్టెంట్లుండగా, తరచూ గ్రామాలతో పాటు కేంద్రాల్లోనూ వైద్య సేవలందిస్తున్నాం.
Updated Date - Dec 23 , 2024 | 01:27 AM