ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

man-beast -పసిమొగ్గను చిదిమేసిన మానవ మృగం

ABN, Publish Date - Nov 03 , 2024 | 02:13 AM

ముక్కు పచ్చలారని ఓ చిన్నారి బతుకును చిదిమేసిందో మానవమృగం. కన్నూమిన్నూ కానక ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడి అమానుషంగా హత్యచేసిన వైనంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు

Child Dead

మూడేళ్ల చిన్నారిపై రాక్షసకృత్యం

లైంగికదాడిచేసి అమానుషంగా హత్య

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

రూ.10లక్షలు ప్రకటించిన ప్రభుత్వం

నేడు చిన్నారి తల్లితండ్రుల పరామర్శకు హోంమంత్రి

దారుణ సంఘటనపై సర్వత్రా ఆగ్రహం


పుత్తూరు అర్బన్‌, కేవీబీపురం, వడమాలపేట నవంబర్‌ 2(అంధ్రజ్యోతి): ముక్కు పచ్చలారని ఓ చిన్నారి బతుకును చిదిమేసిందో మానవమృగం. కన్నూమిన్నూ కానక ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడి అమానుషంగా హత్యచేసిన వైనంతో జిల్లా ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెక్కాడితే గాని డొక్కాడని ఓ పేద కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ అమానవీయ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. కేవీబీపురం మండలానికి చెందిన నిరుపేద దంపతులకు బాబు, పాప ఉన్నారు. పాపకు మూడేళ్లు. ఉన్న ఊరిలో బతకడానికి సరైన దారిలేక ఈ మధ్య భార్య పుట్టిన వడమాలపేట మండలానికి వచ్చారు. అక్కడే కూలిపనులు చేసుకుంటూ బతుకుతున్నారు.


ఆనందం అంతలోనే ఆవిరి

దీపావళి పండుగ జరుపుకోవాలని ఆ దంపతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. చిన్నారి తండ్రి తనకున్న ఆర్థిక స్థోమత మేరకు బాణసంచా తెచ్చాడు. తర్వాత పొరుగూరికి వెళ్లాడు. ఇంతలోనే చిన్నారి కనిపించడం లేదంటూ అతనికి భార్య తల్లి ఫోన్‌ చేసింది. బాగా వెతుకు.. భయపడవద్దంటూ ఫోన్‌లోనే ధైర్యం చెప్పాడు. వెంటనే ఇంటికి చేరుకున్నాడు. ఊరంతా బాలిక కోసం జల్లెడ పట్టారు. అయినా కనిపించకపోయే సరికి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వచ్చిన సుశాంత్‌ చిన్నారిని తీసుకెళ్లాడని గుర్తుకు తెచ్చుకున్నారు. అతడిని ఆరా తీసినా తనకేమీ తెలియదంటూ బుకాయించాడు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సుశాంత్‌ను విచారించేసరికి ఘాతుకం బయటపడింది.


బంధువు కావడంతో

ఈ దంపతులకు దగ్గర బంధువైన యువకుడు సుశాంత్‌ (22) ఇటీవల బెంగళూరు నుంచి కాలనీలో ఉంటున్న పెదనాన్న ఇంటికి వచ్చాడు. కొన్ని రోజులుగా పనులకు వెళ్లకుండా మద్యం తాగుతూ ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం సుశాంత్‌ చాక్లెట్‌ ఆశ చూపించి చిన్నారిని తనతో తీసుకుపోయాడు. ఎవరూ లేని ప్రదేశంలో లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హతమార్చి మురికికాల్వలో పూడ్చేశాడు. తమ గారాలపట్టి కనిపించకపోయే సరికి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కొన్ని గంటల తర్వాత తెలిసిన దుర్మార్గుడి ఘాతుకంతో నిశ్చేష్టులయ్యారు.


విషాదం

నిందితుడు సుశాంత్‌ను అరెస్టు చేసి, చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. శనివారం పుత్తూరులో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి చేర్చారు. చిన్నారి మృతదేహాన్ని చూసి ఊరంతా కన్నీటిపర్యంతమయ్యారు. కాలనీ విషాదంలో మునిగిపోయింది. చిన్నారి తల్లి స్పృహతప్పి పడిపోయింది. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. గ్రామస్తులే చిన్నారికి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో సీఐ భాస్కర్‌నాయక్‌, ప్రత్యేక పోలీసు దళం, కేవీబీపురం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


నేడు హోం మంత్రి రాక

నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీస్‌ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం రానున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షలను ఆమె అందజేయనున్నారు. ఇది హేయనీయమైన చర్యగా అనిత అభివర్ణించారు. స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందిస్తూ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్షపడేలా ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కేసును చాలా తీవ్రంగా పరిగణించినట్లు ఎస్పీ సుబ్బరాయుడు చెప్పారు. ప్రభుత్వ స్పందన, సంఘటన తీవ్రతను గుర్తించిన జిల్లా అధికారులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆర్‌డీఓ రామ్మోహన్‌ తదితరులు చిన్నారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా సాయంగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. క్లూస్‌ టీం రంగంలోకి దిగి ఆధారాలను సేకరించారని ఎస్పీ చెప్పారు. పాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా, పీడీ ట్రైల్‌ చేసి కఠిన చర్యలు చేపడతామన్నారు. కాగా చిన్నారిని అమానుషంగా హత్యచేసిన నిందితుడిని తమకు అప్పగించాలంటూ గ్రామస్తులు, బంధువులు ఎస్‌పీ సుబ్బారాయుడు ఎదుట వాపోయారు. గ్రామానికి వచ్చిన ఎస్పీ వద్ద వారంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.


అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే భానుప్రకాష్‌

చిన్నారిని హత్యాచారం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారని ఎమ్మెల్యే భానుప్రకాష్‌ తెలిపారు. బాధిత కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను పుత్తూరు, వడమాలపేట మండలాల నాయకులు గంజి మాధవయ్య, ధనంజయులునాయుడు, లోకరాజు, జీవరత్నం నాయుడు, కరుణాయాదవ్‌, షణ్ముగరెడ్డి, తదితరులు ఓదార్చారు. చిత్తూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు రాజన్‌ రూ.20 వేలు, పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు కార్జాల అరుణ రూ.5 వేలు ఆర్థికసాయం అందించారు. సంఘటనను ఖండిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు.

ఇది కూడా చదవండి

RK Kothaapluku : మరీ ఇంత నీచమా?

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Nov 03 , 2024 | 07:34 AM