Tirupati: వయనాడ్‌ ఎన్నికల బరిలో తిరుపతి జిల్లావాసి

ABN, Publish Date - Nov 11 , 2024 | 01:31 AM

ఇంతకాలం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహించిన కేరళ రాష్ట్రం వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండకు చెందిన డాకర్‌ దుగ్గిరాల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు.

Tirupati: వయనాడ్‌  ఎన్నికల బరిలో తిరుపతి జిల్లావాసి
నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న డాక్టరు నాగేశ్వర రావు

ఎర్రావారిపాలెం, ఆంధ్రజ్యోతి: ఇంతకాలం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహించిన కేరళ రాష్ట్రం వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండకు చెందిన డాకర్‌ దుగ్గిరాల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు.రాహుల్‌గాంధీ రాజీనామా నేపథ్యంలో ఆయన సోదరి ప్రియాంకగాంధీ ఇక్కడ కాంగ్రెస్‌ తరపున బరిలో వున్న విషయం తెలిసిందే.ఇక్కడ పోటీ చేస్తున్న 16 మంది అభ్యర్థుల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఆర్‌. రాజన్‌ తప్ప మిగతా వారంతా స్థానికేతరులు కావడం విశేషం. పోటీ చేస్తున్న ఇద్దరు తెలుగు వారిలో ఒకరైన డాక్టర్‌ నాగేశ్వరరావు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈయన జాతీయ జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్నారు.

Updated Date - Nov 11 , 2024 | 01:31 AM