ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిత్తూరు పోలీసులకు ఏబీసీడీ అవార్డు

ABN, Publish Date - Dec 19 , 2024 | 01:51 AM

నేర పరిశోధనలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పోలీసుశాఖ ఇచ్చే ప్రతిష్టాత్మక ఏబీసీడీ అవార్డును చిత్తూరు జిల్లా పోలీసులు సాధించారు.

అవార్డును అందుకుంటున్న ఎస్పీ మణికంఠ తదితరులు

చిత్తూరు అర్బన్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి: నేర పరిశోధనలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పోలీసుశాఖ ఇచ్చే ప్రతిష్టాత్మక ఏబీసీడీ అవార్డును చిత్తూరు జిల్లా పోలీసులు సాధించారు. ఈ ఏడాది జూలై 7న ఏటీఎంను పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట్ర దొంగలముఠాను సకాలంలో సాంకేతికతను వినియోగించి అరెస్టు చేశారు. ఇందుకుగాను చిత్తూరు సబ్‌ డివిజనల్‌, వెస్ట్‌ సర్కిల్‌ పోలీసుల కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం మొదటి బహుమతి కింద రూ. లక్షను ప్రదానం చేశారు.విజయవాడలోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావుల చేతులమీదుగా అడిషనల్‌ డీజీపీ రవిశంకర్‌, లా అండ్‌ ఆర్డర్‌ ఐజీ శ్రీకాంత్‌ సమక్షంలో ఎస్పీ మణికంఠ చందోలు, గత వెస్ట్‌ సర్కిల్‌ సీఐ రవిశంకర్‌రెడ్డి, టెక్నికల్‌ టీం సభ్యులు దేవరాజులు, గోపి, నవీన్‌లకు ఈ అవార్డును స్వీకరించారు.మూడునెలలకోసారి ఏబీసీడీ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది.

Updated Date - Dec 19 , 2024 | 01:51 AM