MP: పనితీరు మార్చుకోకుంటే చర్యలు
ABN, Publish Date - Oct 12 , 2024 | 01:15 AM
పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని ఆరిమాకుపల్లె పీహెచ్‌సీ సిబ్బందిపై చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీరంగరాజపురం, అక్టోబరు 11: పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని ఆరిమాకుపల్లె పీహెచ్‌సీ సిబ్బందిపై చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎస్‌ఆర్‌పురం, ఆరిమాకుపల్లె పీహెచ్‌సీలను తనిఖీ చేశారు. ఆరిమాకుపల్లె కేంద్రంలో పారిశుధ్యం అధ్వానంగా ఉండడం చూసి అసహనం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ఇక్కడికొచ్చే రోగులను తమిళనాడు ప్రైవేట్ ఆస్పత్రికి పంపుతున్నారన్న సమాచారం తనకుందంటూ మందలించారు. హాజరు పట్టికను, రికార్డులను పరిశీలించారు. వైద్యులు విధుల్లో లేకపోవడాన్ని తప్పుపట్టారు. ఇలాగే వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలకు ఆదేశించాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం ఎస్‌ఆర్‌పురం ఆయుష్మాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కేంద్రంలో నెలకొన్న సమస్యలను ఎంపీ దృష్టికి వైద్యులు తీసుకురాగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఎంపీ వెంట టీడీపీ మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, తెలుగు మహిళా అధ్యక్షురాలు అరుణ, టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గంధమనేని రాజశేఖర్ నాయుడు, నాయకులు పత్తి గుణశేఖర్ నాయుడు, బాలు, గుండయ్య, శ్రీధర్ యాదవ్, కుమార్, జయచంద్ర నాయుడు, సుబ్రహ్మణ్యంరెడ్డి, సిద్ధయ్యశెట్టి, నాగారాజు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 12 , 2024 | 01:15 AM