ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: టీటీడీ ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలిస్తున్న ప్రభుత్వం

ABN, Publish Date - Sep 22 , 2024 | 10:41 AM

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కోట్లాది మంది భక్తుల మనో భావాలతో ముడిపడిన అంశం కావడంతో సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

అమరావతి: తిరుమల లడ్డూ (Tirumala Laddu)లో కల్తీ నెయ్యి వాడకంపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt.,) భావిస్తోంది. టీటీడీ ఈవో (TTD EO) ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత సంతరించు కోవడంతో కఠినంగా వ్యవహరించాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. కోట్లాది మంది భక్తుల మనో భావాలతో ముడిపడిన అంశం కావడంతో సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత సిట్, సీఐడీ, సీబీఐ విచారణల్లో ఏదో ఒకటి చేయించాలని అధికారులు భావించారు. అయితే లడ్డూ వివాదంపై కేంద్రం కూడా సీరియస్‌గా ఉండటంతో సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోజు రేపటిలోగా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని ప్రభుత్వం కోరనుంది. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆచీతూచి అడుగులు వేస్తోంది.


కాగా శ్రీవారి భక్తులు పవిత్ర ప్రసాదంగా భావించే లడ్డూను అపవిత్రం చేశారంటూ తిరుపతిలో శనివారం ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు ఆందోళనలు చేపట్టారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బా రెడ్డి, భూమన కరుణాకర రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. వారిని అరెస్టు చేయాలని బీజేపీ నేతలు, జనసేన నేతలు ఎస్పీ సుబ్బరాయుడికి వినతిపత్రాలు అందజేశారు.


అఖండ దీపానికీ అదే నెయ్యి వాడారా

‘కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదాల్లో వినియోగించడమే కాకుండా శ్రీవారి మూలవిరాట్‌ ముందు అఖండ దీపానికి వినియోగించి ఉంటే దానిపైనా విచారణ జరగాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి’ అని కూటమి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు , పులివర్తి నాని, మురళీ మోహన్‌ , గురజాల జగన్మోహన్‌ డిమాండు చేశారు.. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.శనివారం తిరుపతిలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. లడ్డూ నాణ్యత తగ్గిందని పవన్‌ కల్యాణ్‌ గతంలోనే చెప్పారని జంగాలపల్లి శ్రీనివాసులు అన్నారు. అన్యమతస్తులు కొండపై చేరి సర్వనాశనం చేశారని, అయితే దేవుడి శిక్షనుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. స్వయం ప్రకటిత మేధావి కరుణాకర రెడ్డి ఏమీ ఎరగనట్టు ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తిరుమలను కూడా వైసీపీ వారు సొంత అవసరాలకు వాడుకున్నారని పులివర్తి నాని ఆరోపించారు. ఈ వ్యవహారంలో జగన్‌కు అత్యంత సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ప్రమేయమూ ఉందని ఆరోపించారు. ఆల్ఫా కంపెనీకి 2 లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా కాంట్రాక్టు ఇచ్చారంటే కమీషన్లకు కక్కుర్తిపడే ఆ పనిచేశారని ఎవరికైనా అర్థమైపోతుందన్నారు. ఆధ్యాత్మికతను వంటినిండా పులుముకుని కనిపించే చెవిరెడ్డి ఇప్పుడు ఎక్కడికి పోయారో తెలియడంలేదన్నారు. తిరుమలలో అపచారం జరిగిందని నిరూపిస్తే డైవర్షన్‌ రాజకీయాలంటారా? వైసీపీవే వక్రబుద్ధి రాజకీయాలని మురళీ మోహన్‌ విమర్శించారు. ఆలయాన్ని వైసీపీ కార్యాలయం లాగా మార్చుకున్నారని పేర్కొన్నారు. లడ్డూ కల్తీపై చర్చకు, ప్రమాణానికి సిద్ధమా అని నారా లోకేశ్‌ సవాల్‌ విసిరితే తప్పు చేయకపోతే కోర్టును ఎందుకు ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో టీటీడీని కూడా వైసీపీ నేతలు భ్రష్టుపట్టించారని గురజాల జగన్మోహన్‌ అన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి ప్రసాదాన్ని కలుషితం చేశారని దుయ్యబట్టారు. తప్పుచేసిన వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదన్నారు.


సీబీఐ విచారణ చేయాలి - సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్యే

పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేసిన అంశంపై సీబీఐతో విచారణ జరిపించి, దోషులను శిక్షించాలి. రీటెండరింగ్‌ విధానంతో రూ.320కే కిలో నెయ్యి కొన్నామని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్‌రెడ్డి, ధర్మారెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలి. గత ఐదేళ్లలో నిత్యం కొండపై శిలువ గుర్తులు, కాఫీ కప్పులు, గంజాయి అమ్మకాలు సాగాయి. జే బ్రాండ్‌ మద్యం తరహాలో జగన్‌ బ్రాండ్‌ నెయ్యి తెచ్చారు.

కల్తీ నెయ్యితో రూ.కోట్లు దోచుకున్నారు - భానుప్రకాష్‌ రెడ్డి

కల్తీ నెయ్యితో స్వామి వారికి నైవేద్యాలు చేయించి, రూ.కోట్లు దోచుకున్న మాజీ సీఎం జగన్‌, మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిలు కాలగర్బంలో కలసిపోతారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌ రెడ్డి దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో బాధ్యులను అరెస్టు చేయాలని బీజేపీ నేతలు సామంచి శ్రీనివాస్‌, అజయ్‌కుమార్‌, మునిసుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన ఎస్పీ సుబ్బరాయుడికి ఫిర్యాదు చేశారు. హిందువుల ఆరాధ్య దైవం తిరుమలను ఐదేళ్లలో అపవిత్రం చేసి ఇష్టానుసారంగా దోచుకున్నారని, ల్యాబ్‌ నివేదిక బయటపెట్టడంతో అవినీతికి పాల్పడిన అధికారులు, చైర్మన్లు తడుముకుంటున్నారన్నారు. క్రిస్టియన్‌ మిషనరీలతో చేతులు కలిపి తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా జగన్‌ ప్రవర్తించారని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్, ధర్మారెడ్డిలను శిక్షించాల్సిందే..

పవన్ కల్యాణ్11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష..

జగన్‌.. మహా పాతకం!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 22 , 2024 | 10:41 AM