BJP: ఢిల్లీలో జగన్ చేసింది ధర్నా కాదు.. డ్రామా..: భాను ప్రకాష్ రెడ్డి
ABN, Publish Date - Jul 26 , 2024 | 12:55 PM
తిరుపతి: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసారని.. అది ధర్నాలా లేదని.. డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉందని ఎద్దేవా చేశారు.
తిరుపతి: బీజేపీ (BJP) రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) వైసీపీ అధ్యక్షుడు (YCP Chief), మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Ex CM Jagan)పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసారని.. అది ధర్నాలా లేదని.. డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉందని ఎద్దేవా చేశారు. వాళ్లు.. వాళ్లు కొట్టుకుని, చంపుకొని కూటమిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎక్కడ చనిపోయారో పేర్లతో పాటు 24 గంటల్లో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలు ఇచ్చిన దెబ్బకు జగన్‌కు మైండ్ పోయిందని అన్నారు. రాష్ట్రంలో విద్వాంస పాలన చేశారని, ఏపీని సర్వ నాశనం చేశారని, శాంతి భద్రతలు లేని రాష్ట్రంగా మార్చేసారని భాను ప్రకాష్ రెడ్డి దుయ్యబట్టారు.
జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని, జగన్ పాలనపై నమ్మకం లేకనే ప్రజలు ఇంటికి పంపారని భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. లిక్కర్ గోల్ మాల్ రూ. 99 వేల కోట్ల నగదు జరిగిందని, రూ. 620 కోట్ల డిజిటల్ మార్పు జరిగిందన్నారు. ఇప్పటికే వాసుదేవరెడ్డిపై చర్యలు ప్రారంభమయ్యాయన్నారు. ‘‘డిల్లీకి వెళ్తే ఎవరు నిన్ను కాపాడారు. వికసించే భారత్‌ను ప్రజల కోసం చేయాలని అనుకుంటున్నాము.. హెలికాప్టర్‌లో తిరిగే ఏకైక ముఖ్యమంత్రి ఆయన ఒక్కడే... ప్రజా దానాన్ని దోచుకున్న ఆలీబాబా వైసీపీ దొంగ అని అంటున్నారు... ఏపీని గంజాయి ప్రదేశ్‌గా మార్చింది నువ్వే.. పట్టుబడిన దానిలో ... విక్రయాల్లో నెంబర్ 1గా మార్చారు... నీ మాటలు నమ్మే పరిస్థితి లేదు.. జీవితాంతం జగన్ కళ్లు మూసుకుని ఉండాల్సిందే... సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేయాలని అనుకుంటున్నాము.. నిన్ను శత్రువుగా చూడలేదు.. కేంద్రం ఏపీని ఆదుకుంటుంది. రికార్డులు కాల్చితే తప్పించుకోలేరు.. త్వరలో ఆధారాలతో బయట పెడతాం’’ అని భాను ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో ప్రజలపై జరిగిన దాడులను లోకమంతా చూసిందని భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆందోళన ప్రదేశ్‌గా మార్చిన ఘనత జగన్‌కే దక్కిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్రంలో శాంతి వాతావరణం నెలకొందని తెలిపారు. కక్ష సాధింపులు కాదని.. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌వైపు అడుగులు వేస్తుందని ఆయన అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన అరాచకాలు దేశవ్యాప్తంగా చర్చగా మారాయని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. కానీ ఇప్పుడు జగన్ మసిపూసి మారేడుకాయ చందంగా కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. విధ్వంసం సృష్టించిన ఏ నాయకులను వదిలిపెట్టమని హెచ్చరించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. (ఫోటో గ్యాలరీ)
పత్రికలకు ప్రకటనలపై టీడీపీ సభ్యుల ఆగ్రహం
పోలవరంపై చంద్రబాబు కీలక నిర్ణయం..
కుప్పంలో చేరికలను వ్యతిరేకిస్తున్న టీడీపీ క్యాడర్
మా భూములు మాకు కావాలి.. తిరగబడ్డ జనం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 26 , 2024 | 12:55 PM