Bhanuprakash: టీటీడీ ఈవో అయితే ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటారా?
ABN, Publish Date - Feb 03 , 2024 | 11:53 AM
Andhrapradesh: అన్యమతస్థులను శ్రీవారి సేవకు అనుమతించే అంశాన్ని పరిలిస్తామంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి చేసిన ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తిరుమల, ఫిబ్రవరి 3: అన్యమతస్థులను శ్రీవారి సేవకు అనుమతించే అంశాన్ని పరిలిస్తామంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharmareddy) చేసిన ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి (BJP Leader Bhanuprakash Reddy) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ ఈవోపై ఫైర్ అయ్యారు. అన్యమతస్థులను శ్రీవారి సేవకు అనుమతించే అంశాన్ని పరిలిస్తామని ఈవో ధర్మారెడ్డి ప్రకటించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అన్యమతస్థుల సేవలను వినియోగించుకుంటామని ధర్మారెడ్డి ఏ హోదాలో ప్రకటిస్తారని ప్రశ్నించారు.
టీటీడీ ఈవో అయితే ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటారా అని నిలదీశారు. అన్యమతస్థుల సేవలు టీటీడీకి అవసరం లేదన్నారు. ధర్మారెడ్డి తన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే టీటీడీలో అనేక మంది అన్యమతస్థులు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. స్వామి వారికి మొక్కని వారు టీటీడీలో విధులు నిర్వర్తిస్తూ జీతాలు తీసుకుంటున్నారన్నారు. టీటీడీలో పని చేస్తున్న అన్యమతస్థ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 03 , 2024 | 04:45 PM