ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పొలంలో దంపతుల ఆత్మహత్య

ABN, Publish Date - Dec 26 , 2024 | 01:40 AM

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె పంచాయతీ కూచువారిపల్లెలోని పొలంలో బుధవారం దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

సురేంద్రనాయుడు, లత దంపతులు (ఫైల్‌ ఫొటో)

చంద్రగిరి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె పంచాయతీ కూచువారిపల్లెలోని పొలంలో బుధవారం దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. కూచువారిపల్లెకు చెందిన సురేంద్రనాయుడు, లత దంపతులు తిరుపతిలో నివాసం ఉంటున్నారు. సురేంద్రనాయుడు ఎస్పీడీసీఎల్‌లో సీనియర్‌ లైన్‌మన్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమార్తెలకూ వివాహమైంది పెద్ద కుమార్తె నైనా మలేషియాలో, చిన్న కుమార్తె లిఖిత అమెరికాలో స్థిరపడ్డారు. నాలుగు రోజుల క్రితం నైనా పుట్టింటికి వచ్చారు. బుధవారం ఉదయం ఇంట్లో చిన్నపాటి గొడవ జరిగింది. అనంతరం సురేంద్రనాయుడు, లత దంపతులు ద్విచక్ర వాహనంలో తిరుపతి నుంచి కూచువారిపల్లె వద్ద పొలానికి వచ్చారు. అక్కడి వేప చెట్టుకు ఉరేసుకున్నారు. సమీపాన ఇటుక బట్టీ కార్మికులు చూసి, స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంధువులు, స్థానికులు వీరి మృతదేహాలను చూసి బోరున విలపించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు నిర్వహించారు. చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకొన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 26 , 2024 | 01:40 AM