ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati: తిరుమల.. లడ్డూకు భారీగా పెరిగిన డిమాండ్..

ABN, Publish Date - Sep 22 , 2024 | 10:00 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం మహాశాంతి యాగాని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలోని యాగ శాలలో అర్చకులు హోమం నిర్వహించనున్నారు. రేపటి రోజున రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో.. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమాన్ని నిర్వహించనున్నారు.

తిరుపతి: తిరుమల (Tirumala) శ్రీవారి మహా ప్రసాదమైన లడ్డూ (Laddu)కు భారీగా డిమాండ్ (Demand) పెరిగింది. లడ్డూ చుట్టూ వివాదాలు తలెత్తిన నేపథ్యంలో లడ్డూ విక్రయాలు తగ్గి ఉంటాయని భావించినప్పటికీ.. భారీగా లడ్డు విక్రయాలు పెరిగాయి. కల్తీ నెయ్యి వివాదం లడ్డూ విక్రయాలపై ప్రభావం చూపలేదు. లడ్డూ తయారీలో అపశ్రుతులు జరిగినా.. శ్రీవారి లడ్డూను పరమ ప్రవిత్రంగా భక్తులు భావిస్తున్నారు. ఈ నెల (సెప్టెంబర్)19వ తేదిన 3.59 లక్షలు, 20 వ తేదిన 3.16 లక్షలు, 21 వ తేది 3.66 లక్షల లడ్డూలను శ్రీవారి భక్తులు కొనుగోలు చేశారు.


కాగా తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం మహాశాంతి యాగాని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలోని యాగ శాలలో అర్చకులు హోమం నిర్వహించనున్నారు. రేపటి రోజున రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో.. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమాన్ని నిర్వహించనున్నారు. ముందుగా మహ శాంతి యాగం, వాస్తూ హోమం నిర్వహిస్తారు. చివరిగా పంచగవ్యాలతో సంప్రోక్షణ నిర్వహించనున్నారు. శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్క రోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు.

తిరుమల పవిత్రతకు ఉద్దేశపూర్వకంగానే పాతర వేశారని తేలిపోయింది. తవ్వేకొద్దీ జగన్‌ అరాచక పాలన సృష్టించిన సంక్షోభం తెలిసి వస్తోంది. అధికారంలోకి రావడం రావడమే తిరుమల పాలనను అస్తవ్యస్తం చేసేశారు. అత్యంత వివాదాస్పదులుగా ముద్రపడిన తన బంధువులకు, అధికారులకు టీటీడీ పగ్గాలు అప్పగించి, వారి ఇష్టారాజ్యానికి కలియుగ దైవాన్నీ, భక్తులనూ వదిలేశారు. నాణ్యతకు, పవిత్రతకు భరోసా ఇచ్చిన డెయిరీల నుంచి నెయ్యి సేకరణను ఆపివేయించడం జగన్‌ అరాచకపర్వానికి పరాకాష్ఠ. నచ్చిన కంపెనీలకు నెయ్యి కాంట్రాక్టు ఇవ్వడానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన లడ్డూ పవిత్రతను సైతం మంటగలిపేశారు.


రాష్ట్రంలోని టీటీడీ సహా ప్రముఖ ఆలయాల అవసరాల కోసం నెయ్యిని స్థానిక సహకార డెయిరీల నుంచి కొనుగోలు చేసేవారు. తిరుమల పవిత్రతను, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక డెయిరీల నుంచి మంచి నెయ్యిని సేకరించేవారు. దీనికోసం అప్పటి ప్రభుత్వాలు జీవో 418ను కూడా జారీచేశాయి. ఈ ప్రక్రియను ఈ - ప్రొక్యూర్‌మెంట్‌ విధానం ద్వారా చేపట్టాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను కాపాడటానికి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరింత బలపరుస్తూ 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మరొక సర్యూలర్‌ జారీచేసింది. ప్రముఖ ఆలయాల్లో ఉపయోగించే నెయ్యిని కూడా స్థానిక సహాకార డెయిరీల నుంచి కొనుగోలు చేయాలని అందులో స్పష్టం చేసింది. ఆ తర్వాత కొద్ది మాసాలకే టీడీపీ ప్రభుత్వం దిగిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2020లో నెయ్యి ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో మార్పులు తీసుకువచ్చింది. కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ అప్పటివరకు తిరుమల ఆలయం అవసరాల కోసం సరఫరా చేస్తున్న నందినీ బ్రాండ్‌ నెయ్యిని నిలిపివేసింది. దీంతో తిరుమల పవిత్రత అనేది పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది. రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా గత జగన్‌ ప్రభుత్వం నాడు ఎంపిక చేసిన ఐదు కంపెనీల్లో ఒకటి సరఫరా చేసిన నెయ్యిలోనే పంది, ఎద్దు కొవ్వు, చేప నూనెలు, వెజిటబుల్‌ ఆయిల్‌ ఉన్నట్టు బయటపడటం, దానిపై దేశమంతా భగ్గుమనడం తెలిసిందే.


పవన్ కల్యాన్ 11 రోజుల పాటు దీక్ష..

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. కలియుగ ప్రత్యక్షదైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని అన్నారు. ‘‘అమృతతుల్యంగా.. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మలినమైంది. విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడికట్టగలరు. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నుంచి నా మనసు కలత చెందింది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నా దృష్టికి ఈ అంశం రాకపోవడం బాధించింది. బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతిఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. అందులో భాగంగా నేను ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేయాలని సంకల్పించాను. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతా. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించిన అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటా. దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటా భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇలాంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే టీటీడీ బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోడం. కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. ధర్మాన్ని పునరుద్ధరించే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది. ధర్మో రక్షతి రక్షితః’’ అంటూ పవన్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్, ధర్మారెడ్డిలను శిక్షించాల్సిందే..

పవన్ కల్యాణ్11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష..

జగన్‌.. మహా పాతకం!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 22 , 2024 | 10:00 AM