ఇసుక అక్రమ రవాణాను ఉపేక్షించం Don't ignore sand smuggling
ABN, Publish Date - Dec 25 , 2024 | 02:23 AM
ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టంచేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి మొదటి వారంలో జిల్లాలో మూడు డిసిల్టేషన్ పాయింట్ల నుంచి ఇసుక ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 1,37,686మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. స్వర్ణముఖి నదీ తీరప్రాంతమైన పెళ్లకూరు మండలం పుల్లూరు గ్రామం, దిగువకలువకూరు, కోట మండలం గుడాలిగ్రామంలో ఇసుక అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.
త్వరలో మూడు కేంద్రాల నుంచి పంపిణీ
తిరుపతి(కలెక్టరేట్), డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టంచేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి మొదటి వారంలో జిల్లాలో మూడు డిసిల్టేషన్ పాయింట్ల నుంచి ఇసుక ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 1,37,686మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. స్వర్ణముఖి నదీ తీరప్రాంతమైన పెళ్లకూరు మండలం పుల్లూరు గ్రామం, దిగువకలువకూరు, కోట మండలం గుడాలిగ్రామంలో ఇసుక అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. ఇసుక తవ్వడానికి, రవాణాకు ఏజెన్సీకి అప్పగించామన్నారు. ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకున్నా లేదా నేరుగా వెళ్లి నామమాత్రపు రుసుం చెల్లించి ఈ స్టాక్ పాయింట్ల నుంచి ఇసుక పొందవచ్చన్నారు. ఇసుక ధర, రవాణా తదితర సమాచారం అన్ని సచివాలయాల్లో, తహసీల్దారు, ఎంపీడీవో, పోలీసు కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. సరిహద్దు ప్రాంతమైన తడ, గాదంకి, సురుటుపల్లి చెక్‌పోస్టుల వద్ద పోలీసు, రెవెన్యూ నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్పీ సుబ్బరాయుడు, అధికారులు భానుప్రకా్‌షరెడ్డి, బాలాజీనాయక్, శ్రీనివాసరావు, మురళీమోహన్ పాల్గొన్నారు.
Updated Date - Dec 25 , 2024 | 02:23 AM