ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం పీఏగా దుర్గాప్రసాద్‌?

ABN, Publish Date - Dec 22 , 2024 | 01:59 AM

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి (పీఏ)గా దుర్గాప్రసాద్‌ను నియమించినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి.

కుప్పం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి (పీఏ)గా దుర్గాప్రసాద్‌ను నియమించినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న నారా భువనేశ్వరిని శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో దుర్గాప్రసాద్‌ అనే వ్యక్తి కలిసి మాట్లాడారు. ఆమె జాగ్రత్తగా పనిచేసుకోవాలని, ఆయనకు సూచించారు. జన నాయకుడు పోర్టల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సంభాషణ జరిగింది. అక్కడున్న పార్టీ వర్గాలను ఆరా తీయగా, దుర్గాప్రసాద్‌ అనే వ్యక్తి విజయవాడ ప్రాంతంనుంచి వచ్చారని, ముఖ్యమంత్రి చంద్రబాబే ఆయనను స్వయంగా కుప్పం పంపించారని చెప్పారు. సీఎం పీయేగా దుర్గాప్రసాద్‌ను పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి ఆయనను ట్రయల్‌ రన్‌ మీద కుప్పం పంపించారని, పనితీరు చూసిన తర్వాత సీఎం పీయేగా అధికారికంగా నియామకం జరుగుతుందని తెలిసింది. కాగా 1989లో చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నప్పటినుంచీ పి.మనోహర్‌ ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈయన తిరుపతినుంచి ఇక్కడికి వచ్చారు. అయితే ఎన్నికల ముందు మనోహర్‌ హఠాత్తుగా అనారోగ్యంపాలు కావడంతో చంద్రబాబు ఆయనకు విశ్రాంతినిచ్చారు. అప్పటినుంచీ పార్టీ కార్యాలయానికి, వ్యవహారాలకు దూరంగానే ఉంటూ వస్తున్న మనోహర్‌, సుమారు రెండు నెలలనుంచీ చంద్రబాబు ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయానికి ఆఫీసు వేళల్లో వచ్చి తనపని తాను చూసుకుని వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా వచ్చిన దుర్గాప్రసాద్‌ కచ్చితంగా కొనసాగే అవకాశం వుందని పార్టీ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి.

Updated Date - Dec 22 , 2024 | 01:59 AM