ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముగిసిన తిరుపతి బాలోత్సవం

ABN, Publish Date - Dec 30 , 2024 | 01:24 AM

నగరంలోని నెహ్రూ మున్సిపల్‌ వేదికగా రెండు రోజులపాటు జరిగిన ‘తిరుపతి బాలోత్సవం’ ఆదివారం ముగిసింది. 163 ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్ళకు చెందిన 8,500 మంది విద్యార్థులు హాజరయ్యారు.

రెండు రోజుల్లో 8,500 మంది హాజరు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): నగరంలోని నెహ్రూ మున్సిపల్‌ వేదికగా రెండు రోజులపాటు జరిగిన ‘తిరుపతి బాలోత్సవం’ ఆదివారం ముగిసింది. 163 ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్ళకు చెందిన 8,500 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరికి 30 అంశాల్లో, 70 విభాగాలుగా, 6 సమాంతర వేదికలపై పోటీలు నిర్వహించారు. 3, 4, 5 తరగతి విద్యార్థులను సబ్‌ జూనియర్స్‌గా, 6, 7 తరగతి విద్యార్థులను జూనియర్స్‌గా, 8, 9, 10వ తరగతి విద్యార్థులను సీనియర్లుగా విభజించి పోటీలు పెట్టారు. చిత్రలేఖనం, బొమ్మకు కథ రాయడం, వ్యాస రచన, ఉక్త లేఖనం, లేఖా రచన, దేశ, ప్రపంచ పటాలను రూపొందించడం, జ్ఞాపకశక్తికి పరీక్ష, చెత్తతో కళాకృతి తయారు, ఏకపాత్రాభినయం, క్లాసికల్‌, సోలో డ్యాన్స్‌, క్లాసికల్‌, సోలో సాంగ్‌, గ్రూప్‌ సాంగ్‌, జానపద పాటలు, దేశభక్తి పాటలు, పౌరాణిక నాటికలు, సంగీత వాయిద్యాల ప్రదర్శన, సంప్రదాయ వస్త్రధారణ, చదరంగం, పదకేళి తెలుగులో మాట్లాడటం, వక్తృత్వం, పద్యం-భావం, కథ చెబుతాను-ఊకొడతావా?, గణితం-తర్కం, మట్టితో బొమ్మల తయారీ, కోలాటం, యోగా, శాస్త్రీయ సంగీతం తదితర పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభ చూపారు. ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు సభలో విజేతలకు నిర్వాహకులు సర్టిఫికెట్లు, జ్ఞాపికలను ప్రదానం చేశారు.

Updated Date - Dec 30 , 2024 | 01:24 AM