ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Flowers: పుష్ప విలాపం

ABN, Publish Date - Nov 23 , 2024 | 12:25 AM

బంతి పూలకు కనీస ధర కూడా లేకపోవడంతో రైతులు కోయకుండా తోటపైనే వదిలేస్తున్నారు.రెండు వారాలుగా పూలను కోసి మార్కెట్‌కు తరలిస్తున్నా కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు.

గుంటూరు రోడ్ల పక్కన వి.కోట పూలను పడేస్తున్న వ్యాపారులు

వి.కోట, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): బంతి పూలకు కనీస ధర కూడా లేకపోవడంతో రైతులు కోయకుండా తోటపైనే వదిలేస్తున్నారు.రెండు వారాలుగా పూలను కోసి మార్కెట్‌కు తరలిస్తున్నా కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో బస్తాను వంద రూపాయలకే కట్టబెట్టి వచ్చేస్తున్నారు.మరీ రెండు రోజులుగా పూర్తిగా పూలను కొనేవారే లేకపోవడంతో స్థానిక వ్యాపారులే కొని ఎగుమతి చేస్తున్నారు. కొన్న ధరలకు ట్రాన్స్‌పోర్టు అదనం కావడంతో ఆ నష్టాలు తమకెందుకని పూలను స్థానిక వ్యాపారులు కూడా కొనడం మానేశారు. కొందరేమో పూలను గుంటూరు మార్కెట్‌కు తరలించినా అక్కడా కొనేవారు ముందుకురాకపోవడంతో పూలను గుంటూరు హైవేపక్కన పడేసి వెనుదిరుగుతున్నారు. శుక్రవారం ఉదయం వి.కోట పూల మార్కెట్‌లో 40 కిలోల బస్తా కేవలం వంద మాత్రమే పలికింది. మధ్యాహ్నం 12 గంటలకైతే కొనేవారే ముందుకు రాకపోవడంతో పూలను తెచ్చిన రైతులు లేక ట్రాక్టర్‌ పూలలోడ్డును పట్టణంలోని డంపింగ్‌ యార్డులో పడేసి వెనుదిరిగారు.మరి కొందరు దేవాలయాల వద్ద పడేసి వెళ్ళారు. పూలకు కనీస మద్దతు ధర కూడా పలక్కపోవడంతో నాణ్యమైన దిగుబడులు వచ్చినా కోయకుండా తోటలోనే రైతులు ట్రాక్టర్‌తో దున్నేస్తున్నారు. మద్దిమాకులపల్లెకు చెందిన వెంకటరమణ రెండెకరాల్లో పూలసాగు చేసి, కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కోతకొచ్చిన తోటకు రోటరి వేసేశారు. ఎకరా పూలసాగుకు రూ. 70 వేల దాకా ఖర్చవుతోంది. కిలో బంతిపూలు రూ. 20 పలికితేనే పెట్టుబడులు తిరిగొస్తాయని, అలాంటిది కొనుగోలే లేకపోతే తమ గతి ఏంకావాలని రైతులు వాపోతున్నారు.

Updated Date - Nov 23 , 2024 | 12:25 AM