గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.4.71 కోట్ల చిత్తూరు ఎంపీ నిధులు
ABN, Publish Date - Dec 25 , 2024 | 02:04 AM
చిత్తూరు పార్లమెంటు పరిధిలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.4.71 కోట్ల ఎంపీ నిధులు కేటాయించినట్లు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని గ్రామాలకు మంజూరైన 85 రకాల వివిధ అభివృద్ధి పనులకుగాను ఇప్పటికే రూ.4.71 కోట్ల ఎంపీ నిధులను కేటాయించినట్లు పేర్కొన్నారు.
చిత్తూరు సిటీ, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): చిత్తూరు పార్లమెంటు పరిధిలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.4.71 కోట్ల ఎంపీ నిధులు కేటాయించినట్లు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని గ్రామాలకు మంజూరైన 85 రకాల వివిధ అభివృద్ధి పనులకుగాను ఇప్పటికే రూ.4.71 కోట్ల ఎంపీ నిధులను కేటాయించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజి కాలువలు, కమ్యునిటీ భవనాల నిర్మాణం, రహదారుల అనుసంధానం కోసం ఈ నిధులు వెచ్చించారని తెలిపారు. మామిడి పంటను రైతులకు లాభసాటిగా మార్చేందుకు చిత్తూరులో మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖరాశామని తెలిపారు. పాకాలలో రైల్వే కోచ్ ఏర్పాటు చేయనున్నామని, దీంతో జిల్లా రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చిత్త శుద్ధితో పనిచేస్తున్నామని ఎంపీ ఆ ప్రకటనలో తెలిపారు.
Updated Date - Dec 25 , 2024 | 02:04 AM