ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

International తిరుపతికి అంతర్జాతీయ విమానం వచ్చేసిందోచ్‌!

ABN, Publish Date - Sep 02 , 2024 | 01:37 AM

ఎట్టకేలకు తిరుపతి విమానాశ్రయంలో తొలిసారిగా ఓ అంతర్జాతీయ విమానం సేఫ్‌గా ల్యాండైంది. 2015 నవంబరు 22వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ద్వారా తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానం

రేణిగుంట, సెప్టెంబరు 1: ఎట్టకేలకు తిరుపతి విమానాశ్రయంలో తొలిసారిగా ఓ అంతర్జాతీయ విమానం సేఫ్‌గా ల్యాండైంది. 2015 నవంబరు 22వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ద్వారా తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. చంద్రబాబు ముందుచూపుతో అప్పట్లోనే అంతర్జాతీయ విమాన రాకపోకల కోసం అన్ని వసతులను కల్పించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అంతర్జాతీయ విమానాల రాకపోకలపై దృష్టి సారించలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడటం, తిరిగి చంద్రబాబు సీఎం అయిన మూడు నెలల్లోపే అంతర్జాతీయ విమానం రావడంతో ఇటువంటి విమానాల రాకపోకలకు తొలి అడుగు పడిందనే చెప్పుకోవాలి. ఆదివారం మధ్యాహ్నం 12.11 గంటలకు బహ్రెయిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎంపైర్‌ ఏవియేషన్‌ విమానం నేరుగా తిరుపతి విమానాశ్రయంలో ల్యాండైంది. గల్ఫ్‌దేశంలో స్థిరపడిన కేరళకు చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్‌ రవిపిళ్లై కుటుంబ సభ్యులతో కలిసి ఈ విమానంలో శ్రీవారి దర్శనార్థం తిరుపతికొచ్చారు. ఏటా శ్రీవారి దర్శనానికి వచ్చే ఈయన ఈసారి కేంద్రప్రభుత్వ అనుమతితో ప్రత్యేక విమానంలో వచ్చారు. దీనివల్ల భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపడానికి ఇది తొలి అడుగుగా విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు. కాగా, రవిపిళ్లైకి విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్‌ స్వాగతం పలికారు.

Updated Date - Sep 02 , 2024 | 01:37 AM

Advertising
Advertising