ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లక్ష్మీ ఇంట పండగొచ్చింది

ABN, Publish Date - Dec 29 , 2024 | 02:13 AM

కువైత్‌లోని ఏజెంట్‌ చెరలో చిక్కుకున్న శ్రీకాళహస్తి మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన ఎల్లంపల్లి లక్ష్మి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది.

కువైత్‌ చెర నుంచి శ్రీకాళహస్తికి..

సాయం చేసినవారికి కృతజ్ఞతలు

తిరుపతి, డిసెంబరు28 (ఆంధ్రజ్యోతి) : కువైత్‌లోని ఏజెంట్‌ చెరలో చిక్కుకున్న శ్రీకాళహస్తి మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన ఎల్లంపల్లి లక్ష్మి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. శుక్రవారం రాత్రి తన ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వారి ఇంట పండుగ వాతావరణం కనిపించింది. బిడ్డలను చదివించుకోవాలని కష్టపడి కువైత్‌కు వెళ్లి నరకకూపంలో చిక్కుకున్న ఆమె ఆవేదనకు ‘ఆంధ్రజ్యోతి’ అక్షర రూపమిచ్చింది. ఇండియాకు వెళ్లిపోతానంటే ‘నన్ను చంపి ఎడారిలో పడేస్తామంటున్నారు’ అన్న శీర్షికన సోమవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై ఎస్పీ సుబ్బరాయుడు స్పందించారు. ప్రత్యేక చొరవ తీసుకుని ఆమెకు విమాన టికెట్‌ సిద్ధం చేశారు. దుబాయ్‌లో ఉన్న తిరుపతికి చెందిన ఏపీఎన్‌ఆర్టీ మాజీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ముక్కు తులసీకుమార్‌ ఆమెకు పాస్‌పోర్ట్‌ అందేలా కృషి చేశారు. దీంతో ఆమె శుక్రవారం ఉదయం కువైత్‌ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉన్నట్లు కనిపించారు. ఒకరోజంతా కుటుంబ సభ్యులతో గడిపిన తర్వాత కాస్త కుదుటపడ్డారు. తన ఆవేదనను అందరికీ తెలిసేలా చేసిన ‘ఆంధ్రజ్యోతి’కి, ప్రత్యేక చొరవ తీసుకున్న ఎస్పీ సుబ్బరాయుడుకు, కూటమి ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మా అమ్మను మళ్లీ ఇలా చూస్తామనుకోలేదని, సహకరించిన వారందరికీ పేరుపేరున రుణపడి ఉంటామని కుమార్తె సుచిత్ర అంటున్నారు.

Updated Date - Dec 29 , 2024 | 02:13 AM