Tirupati: పారిపోయిన టెన్తు విద్యార్థుల కథ సుఖాంతం
ABN, Publish Date - Dec 09 , 2024 | 06:57 AM
తిరుపతి నగరంలో వరస మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. పలు కారణాలతో అదృశ్యం అవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కాగా తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుండి పారిపోయిన ముగ్గురు టెన్త్ విద్యార్థులను అన్నమయ్య జిల్లా, ములకలచెరువు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి: తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుండి పారిపోయిన టెన్తు విధ్యార్థుల (10th Students) కథ సుఖాంతం అయింది. తిరుపతి నుంచి ధర్మవరం వైపు రైల్లో పారిపోతున్న ముగ్గురు విద్యార్థులను (Three Students) అన్నమయ్య జిల్లా ములకలచెరువు పోలీసులు (Police) గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో ఈస్టు పోలీసులు తిరుపతికి తీసుకొచ్చారు. అర్థరాత్రి తల్లిదండ్రులకు విద్యార్థులను పోలీసులు అప్పగించారు.
పూర్తి సమాచారం..
తిరుపతి నగరంలో వరస మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. పలు కారణాలతో అదృశ్యం అవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తల్లిదండ్రులు మందలించారని, భర్తతో గొడవ, కుటుంబ, ఆర్థిక సమస్యలు వంటి కారణాలతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. మరోవైపు కిడ్నాప్ కేసులు సైతం వెలుగు చూస్తున్నాయి. అయితే తాజాగా ఒకే రోజు ఆరుగురు ఇంటి నుంచి అదృశ్యం కావడం ఆందోళనకు గురి చేస్తోంది.
అదృశ్యమైంది వీరే..
తిరుపతిలో తల్లిదండ్రులు మందలించారని ముగ్గురు పదో తరగతి విద్యార్థులు ఇంటి నుంచి పారిపోయారు. తాము రైలు ఎక్కి వెళ్లిపోతున్నట్లు ఫోన్ చేసిన విద్యార్థులు తల్లికి సమాచారం అందించారు. ఏదో విషయంలో తప్పు చేశారని రవిశంకరాచారి, పవన్, రానా అనే ముగ్గురు కుమారులను తల్లిదండ్రులు మందలించారు. తల్లిదండ్రులు తిట్టడంతో మనస్తాపానికి గురైన విద్యార్థులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. తాము పారిపోతున్నట్లు తల్లికి సమాచారం అందించారు. దీంతో బాధిత కుటుంబం తూర్పు పోలీసులను ఆశ్రయించింది. తమ ముగ్గురు పిల్లలు కనపడటం లేదని, వారిని రక్షించి తీసుకురావాలని ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతి నుంచి ధర్మవరం వైపు రైల్లో పారిపోతున్న ముగ్గురు విద్యార్థులను అన్నమయ్య జిల్లా ములకలచెరువు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 09 , 2024 | 06:57 AM