ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLC Ramgopal: శ్రీవారి దర్శనాల కేటాయింపులో టీటీడీ తీరు అభ్యంతరకరం

ABN, Publish Date - Jan 03 , 2024 | 12:38 PM

Andhrapradesh: శ్రీవారి దర్శనాలు కేటాయింపు అంశంలో టీటీడీ అధికారుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సామాన్య భక్తులకు స్వామి వారిని టీటీడీ దూరం చేస్తోందని విమర్శించారు.

తిరుమల, జనవరి 3: శ్రీవారి దర్శనాలు కేటాయింపు అంశంలో టీటీడీ అధికారుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి (MLC Ramgopal Reddy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సామాన్య భక్తులకు స్వామి వారిని టీటీడీ దూరం చేస్తోందని విమర్శించారు. ప్రజాప్రతినిధులకు దర్శనాలు కేటాయింపులోనూ టీటీడీ వివక్ష చూపిస్తోందన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులకు టీటీడీ అధికారులు నిత్యం భారీగా టిక్కెట్లు జారీ చేస్తున్నారని ఆరోపించారు.

ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు జరుగుతున్న అన్యాయంపై ఈవోకీ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అధికార పార్టీ నాయకులు భగవంతుడిని కూడా వదలడం లేదన్నారు. గదులు కేటాయింపులో కూడా వివక్ష చూపిస్తున్నారన్నారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై వివక్ష చూపకుండా ప్రజా ప్రతినిధులందరికీ టీటీడీ సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేసేందుకు బ్రేక్ దర్శనాలు రద్దు చేసినా స్వాగతిస్తామని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 03 , 2024 | 12:38 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising