ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

1న కాణిపాకంలో సామాన్య భక్తులకే పెద్దపీట

ABN, Publish Date - Dec 28 , 2024 | 12:59 AM

31న రాత్రి 12 గంటలకు మూల విరాట్‌కు అభిషేకం వేకువజామున 3గంటలనుంచి సర్వదర్శనం ప్రారంభం

సమావేశంలో ప్రసంగిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే

ఐరాల(కాణిపాకం), డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆంగ్ల నూతన సందర్భంగా జనవరి ఒకటోతేదీన కాణిపాక క్షేత్రానికి విచ్చేసే సామాన్య భక్తులకు పెద్డపీట వేయనునున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ మణికంఠ, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌, వరసిద్ధుడి ఆలయ ఈవో పెంచలకిషోర్‌ తెలిపారు. శుక్రవారం ఆలయ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. వారు మాట్లాడుతూ ఈనెల 31వ తేదీన రాత్రి 12 గంటలకు మూల విరాట్‌కు అభిషేకం, చందనాలంకారం నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి ఒకటో తేదీన వేకువ జామున మూడు గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు చెప్పారు. సుమారు 70వేల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా వేశామన్నారు. ప్రతి భక్తుడికీ దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైన క్యూలైన్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ఎక్కువ మంది భక్తులు సొంత వాహనాల్లో వచ్చే అవకాశం ఉందని.. పార్కింగ్‌, ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చూసుకోవాలన్నారు. వీఐపీల కారణంగా సామాన్య భక్తులు ఇబ్బంది పడకూడదన్నారు. ఆలయ ఉభయదారులకు ఓ సమయాన్ని కేటాయించడానికి వారితో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. రద్దీకి అనుగుణంగా లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే చికిత్స కోసం అంబులెన్స్‌ సిద్ధం చేస్తామన్నారు. ఉభయదారులు, స్థానికులు, భక్తులు సహకరించాలని కోరారు. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మృతికి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, ఈఈ వెంటకనారాయణ, ఏఈవోలు రవీంద్రబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, ధనంజయ, తహసీల్దార్‌ మహే్‌షకుమార్‌, సీఐ శ్రీధర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 12:59 AM