అమ్మవారి సేవలో పీవీ సింధు దంపతులు
ABN, Publish Date - Dec 27 , 2024 | 03:21 AM
తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని గురువారం మధ్యాహ్నం భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దంపతులు దర్శించుకున్నారు.
తిరుచానూరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని గురువారం మధ్యాహ్నం భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దంపతులు దర్శించుకున్నారు. నూతన జంట సింధు, వెంకట దత్తసాయి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకోగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు ఆలయ మర్యాదలతోస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకుని పీవీ సింధు దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద వీరికి టీటీడీ క్యాలెండర్, డైరీని భానుప్రకా్‌షరెడ్డి అందజేశారు. అనంతరం అలిపిరి నడకమార్గంలో తిరుమల చేరుకున్న వీరు.. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Updated Date - Dec 27 , 2024 | 03:21 AM