ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

online betting: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలి

ABN, Publish Date - Nov 11 , 2024 | 01:23 AM

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలయ్యాడు. అప్పులిచ్చిన వారు ఒత్తిడి తేవడంతో భరించలేక ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందాడు.

రేవంత్‌(ఫైల్‌ ఫోటో)

చిత్తూరు అర్బన్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు నగరంలోని కలెక్టరేట్‌ వెనుకభాగంలో ఉన్న సుజీవననగర్‌లో ఉంటున్న హరినాథనాయుడు కుమారుడు రేవంత్‌ బీటెక్‌ పూర్తిచేసి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు రూ.లక్ష వరకు జీతం తీసుకుంటున్నాడు. ఖాళీ సమయాల్లో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఆడటం మొదలు పెట్టాడు. తొలి రోజుల్లో కొంత ఆదాయం రావడంతో బెట్టింగ్‌ ఓ వ్యసనంగా మారిపోయింది. పెద్ద మొత్తాలను బెట్టింగ్‌లో పెట్టడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత సుమారు రూ.40 లక్షల వరకు అప్పులు చేసి.. బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. అప్పులిచ్చిన వారు ఒత్తిడి తేవడంతో భరించలేక ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందాడు. తల్లిదండ్రుల సమాచారంతో రెండో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి.. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Nov 11 , 2024 | 01:23 AM