Tirupati: వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి రథోత్సవం
ABN, Publish Date - May 23 , 2024 | 10:59 AM
తిరుపతి: శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం ఉదయం ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపం వరకు సాగింది.
తిరుపతి: శ్రీ గోవిందరాజస్వామి (Sri Govindaraja Swamy)వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం ఉదయం ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా స్వామివారికి రథోత్సవం (Chariot Festival) నిర్వహించారు. రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపం వరకు సాగింది. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు గోవిందనామస్మరణతో రథాన్ని లాగారు. అలాగే 10 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి ఊరేగనున్నారు.
కాగా విశాఖ శారదపీఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరుతాయన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని స్వామి వారిని ప్రార్ధించానని స్వరూపానంద స్వామి తెలిపారు.
కాగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ నెల 15వ తేదీ (బుధవారం) సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. సాయంత్రం 5.30 గంటల నుండి అంకురార్పణ ఘట్టం ప్రారంభమైంది. ముందుగా సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టార్గెట్ ఎమ్మెల్సీ.. ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ..
ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు..
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..
నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 23 , 2024 | 11:03 AM