ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP NEWS: శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కట్టుదిట్టమైన చర్యలు: కలెక్టర్ లక్ష్మిషా

ABN, Publish Date - Feb 29 , 2024 | 09:31 PM

శ్రీకాళహస్తి(Srikalahasti) ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తిరుపతి కలెక్టర్ లక్ష్మీషా(Collector Lakshmi Shah) వ్యాఖ్యానించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మీషా , ఎస్పీ మల్లికాగార్గ్ గురువారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.

తిరుపతి: శ్రీకాళహస్తి(Srikalahasti) ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తిరుపతి కలెక్టర్ లక్ష్మిషా (Collector Lakshmi Shah) వ్యాఖ్యానించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మిషా , ఎస్పీ మల్లికాగార్గ్ గురువారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ... బ్రహ్మోత్సవాల సందర్భంగా క్లీన్ అండ్ గ్రీన్‌గా ఆలయాన్ని ఉంచటంతో పాటు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిస్తున్నామని తెలిపారు. భక్తులకు క్యూలైన్లలో మంచినీరు,  మజ్జిగ అందించటంతో పాటు దర్శనంలో సామాన్య భక్తులకు పెద్దపీఠ వేశామని చెప్పారు.

పురపాలక సంఘం అధికారులు ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. డిప్యూటేషన్‌పై ఇతర మున్సిపాలిటీల నుంచి కూడా సిబ్బంది వస్తారని చెప్పారు. స్వామి అమ్మవార్లతో 28 కిలోమీటర్ల గిరిప్రదక్షిణలో నడిచే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ లక్ష్మిషా వివరించారు. అనంతరం ఎస్పీ మల్లికాగార్గ్‌ మాట్లాడుతూ... బ్రహ్మోత్సవాల్లో పట్టణంలో ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని ఎస్పీ మల్లికాగార్గ్ తెలిపారు. రథోత్సవం, పల్లకి సేవల సమయంలో అవాంఛనీయ సంఘటనలు, ఎలాంటి దొంగతనాలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కీలక ప్రాంతాల్లో భక్తులకు అండగా ఉండటానికి శిబిరాలను ఏర్పాటు చేశామని ఎస్పీ మల్లికాగార్గ్ పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Updated Date - Feb 29 , 2024 | 09:37 PM

Advertising
Advertising