ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tirupati: ఎర్రచందనం అక్రమ రవాణా.. ఐదుగురు తమిళ స్మగ్లర్లు అరెస్టు..

ABN, Publish Date - Jan 12 , 2024 | 02:54 PM

చిత్తూరు జిల్లా భాకరాపేట రేంజ్ నాగపట్ల ఈస్ట్ ఫారెస్టు బీట్ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న దుండగులను

చిత్తూరు జిల్లా భాకరాపేట రేంజ్ నాగపట్ల ఈస్ట్ ఫారెస్టు బీట్ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న దుండగులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో దుంగలను తరలిస్తూ తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన సమయంలో కూలీలు టాస్క్ ఫోర్సు టీంపై రాళ్లు, కొడవళ్లతో దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు పోలీసులు వారిని పట్టుకున్నారు.

తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరుకు చెందిన మణి, తిరుపత్తూరు జిల్లాకు చెందిన హరీష్ శక్తి, వేలూరు జిల్లాకు చెందిన సంతోష్ సెట్టు, ప్రభు ముత్తుస్వామి, శరత్ కుమార్, రామచంద్రన్ లను అరెస్టు చేశారు. స్మగ్లర్లు పడేసిన 11ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.


మరో ఘటనలో గూడూరు-నాయుడుపేట హైవే రోడ్డుపై బూధానం టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఒక కారులోని వ్యక్తులు వాహనం వదిలి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి చూడగా అందులో 7 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. ఈ రెండు కేసుల్లోని ఎర్రచందనం దుంగల విలువ రూ.20లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - Jan 12 , 2024 | 02:54 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising