రెవెన్యూ సదస్సులో టీడీపీ, వైసీపీ బాహాబాహీ TDP and YCP are at odds in the revenue conference
ABN, Publish Date - Dec 25 , 2024 | 02:20 AM
నగరి మండల పరిదిలోని గుండ్రాజుకుప్పం పంచాయతీలో మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఓదశలో అధికారుల ముందు రికార్డులు పెట్టివున్న టేబుళ్లను సైతం నెట్టివేశారు. ఒక వర్గంపై మరొక వర్గం వారు ఆరోపణలు చేసుకుంటూ నువ్వు కబ్జా చేశావంటే నువ్వు చేశావంటూ తీవ్రస్థాయిలో బల్లలు గుద్ది వాదించుకున్నారు. 35 ఏళ్లలో కాపాడిన ఆస్తులను గత ఐదేళ్ల పాలనలో సర్పంచ్ బాలచంద్రారెడ్డి కబ్జా చేశారని, పట్టాలు లేకనే ఇంటి స్థలాలు ఇచ్చారని టీడీపీ వర్గీయులు లక్ష్మీపతిరాజు, ఉమాపతిరాజు విమర్శించారు.
నగరి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): నగరి మండల పరిదిలోని గుండ్రాజుకుప్పం పంచాయతీలో మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఓదశలో అధికారుల ముందు రికార్డులు పెట్టివున్న టేబుళ్లను సైతం నెట్టివేశారు. ఒక వర్గంపై మరొక వర్గం వారు ఆరోపణలు చేసుకుంటూ నువ్వు కబ్జా చేశావంటే నువ్వు చేశావంటూ తీవ్రస్థాయిలో బల్లలు గుద్ది వాదించుకున్నారు. 35 ఏళ్లలో కాపాడిన ఆస్తులను గత ఐదేళ్ల పాలనలో సర్పంచ్ బాలచంద్రారెడ్డి కబ్జా చేశారని, పట్టాలు లేకనే ఇంటి స్థలాలు ఇచ్చారని టీడీపీ వర్గీయులు లక్ష్మీపతిరాజు, ఉమాపతిరాజు విమర్శించారు. పంచాయతీలో క్వారీ సర్పంచ్ బాలచంద్రారెడ్డి అనాధీనంలో ఉందని ఆయనకు రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చారు. అదేవిధంగా చెంగారెడ్డి క్వారీ సమస్యపై కూడా హైకోర్టులో కేసు నడుస్తోంది. ఈక్వారీల విషయమై ఇరువర్గాలు విమర్శించుకున్నారు. ఈ సమావేశంలో 20 అర్జీలు వచ్చాయని తహశీల్దార్ రవికుమార్ తెలిపారు.
Updated Date - Dec 25 , 2024 | 02:20 AM