ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోడి బొచ్చు కథ ముగియలేదు

ABN, Publish Date - Dec 22 , 2024 | 02:18 AM

‘కోడి బొచ్చును కూడా నెలకు రూ.20లక్షలకు అమ్ముకునే వాళ్లు మనకు ఎమ్మెల్యేలుగా కావాలా?’ అని ఎన్నికల ముందు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తిరుపతిలో జరిగిన ప్రజాగళం సభలో మాట్లాడారు. ఇంతకీ కోడి బొచ్చు కథేంటి? అంటూ అప్పట్లో పెద్ద చర్చే నడిచింది.

చికెన్‌ వేస్ట్‌ సేకరిస్తున్న దృశ్యం

చికెన్‌ వేస్ట్‌ మాఫియాలో చొరబడిందెవరు?

పవన్‌ చెప్పినా కొనసాగుతున్న దందా

‘కోడి బొచ్చును కూడా నెలకు రూ.20లక్షలకు అమ్ముకునే వాళ్లు మనకు ఎమ్మెల్యేలుగా కావాలా?’ అని ఎన్నికల ముందు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తిరుపతిలో జరిగిన ప్రజాగళం సభలో మాట్లాడారు. ఇంతకీ కోడి బొచ్చు కథేంటి? అంటూ అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. కోడి బొచ్చు.. అంటే ‘చికెన్‌ వేస్ట్‌’ మాఫియాతో వైసీపీ నేతల హస్తం ఉందన్న ప్రచారం తెరపైకి వచ్చింది. పవన్‌ వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండించకపోవడంతో ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. చికెన్‌ వేస్ట్‌ కూడా అప్పటి అధికార పార్టీ నేతలకు రూ.లక్షల్లో ఆదాయాన్ని తెచ్చిపెట్టినట్టుగా తేటతెల్లమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కోడిబొచ్చు కథ ముగిసిందా.. అంటే లేదనే సమాధానమే వస్తోంది.

గతంలో వైసీపీ నేతలకు కాసులు కురిపించిన కోడిబొచ్చు రవాణా ఇప్పుడూ యథేచ్ఛగా సాగుతోంది. దీని వెనుక కూటమి నాయకులున్నారా? లేదా అధికార యంత్రాంగం కాసులకు కక్కుర్తి పడుతోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక చికెన్‌ వేస్ట్‌ను కూడా క్యాష్‌ చేసుకోవచ్చని తెలుసుకున్నారు. తమకు తెలియకుండా ఏ ఒక్క షాపుకూడా చికెన్‌ వేస్ట్‌ ఇవ్వకూడదని మున్సిపల్‌ అధికారులను అడ్డుపెట్టుకుని మాఫియాకు తెరలేపారు. వారు చూపిన దారిలోనే ఇప్పటివాళ్లుకూడా నడుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉందనేది అంతుపట్టడంలేదు.

ఒకప్పుడు అలా...

కొన్నేళ్ల క్రితం మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది వ్యర్థాలను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించేవారు. దీనికోసం చికెన్‌ స్టాళ్ల యాజమాన్యం సిబ్బందికి కొంత మొత్తం ముట్టజెప్పాల్సి వచ్చేది. డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని వారు వ్యర్థాలను నిర్మానుష్య ప్రాంతాల్లో పడేసేవారు. వీటిని తిరుపతితో పాటు సమీప జిల్లాలలోని చేపల చెరువులు, పందులకు ఆహారంగా వినియోగిస్తూ వచ్చేవారు. దీంతో కొందరు రంగంలోకి దిగి చికెన్‌ స్టాల్స్‌ యాజమాన్యాన్ని సంప్రదించి మీకు ఎలాంటి శ్రమ లేకుండా ఉచితంగా తామే వేస్ట్‌ను తీసుకెళతామని చెప్పడంతో షాపుల నిర్వాహకులు అంగీకరించి వారికి ఇవ్వడం మొదలుపెట్టారు.

ఇలా సేకరిస్తారు...

కోళ్లను కోసిన అనంతరం వ్యర్థంగా పడేసే భాగాలను ప్రత్యేక వాహనాల ద్వారా ఓ ముఠా చేపల చెరువులు, పందులకు ఆహారంగా తరలిస్తోంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ముఠా సభ్యులు ప్రత్యేక వాహనాల్లో చికెన్‌ షాపుల వద్దకు చేరుకుంటారు. కోళ్లనుంచి తీసిన పేగులు, తల, కాళ్లు, చర్మం, ఈకలను వాహనంలోని భారీ ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో వేసుకుని తరలిస్తున్నారు. వీటిని తీసుకెళ్లే వారు అధికమొత్తంగా చేపలకు, పందులకు ఆహారంగా వినియోగిస్తారు. వీటిని తిన్న మనుషులకు ప్రమాదకర వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు.

ఇలా చేయొచ్చు..

వాస్తవానికి వ్యర్థాలు నగరపాలక సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా ఉండాలి. టెండర్‌ ద్వారా ఏదైనా ఏజెన్సీకి అప్పగించి చికెన్‌ వేస్ట్‌ను తీసుకెళ్లేలా చేయాలి. వారు దాన్ని వెట్‌ వేస్ట్‌ ప్రాసిసెంగ్‌ చేసి జంతువులకు ఆహారంగా (మీట్‌మీల్‌) వినియోగిస్తారు. కొన్ని కార్పొరేషన్లలో ఇలాంటి విధానం జరుగుతోంది కూడా. తిరుపతి నగరపాలక సంస్థ మాత్రం అలాంటి పనిచేయకుండా మాఫియా ముఠాకు సహకరించడమేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కిలో కోడి వ్యర్థాల నుంచి 300 గ్రాముల మీట్‌మీల్‌ వస్తుంది. తిరుపతిలో రోజుకు 2 టన్నుల కోళ్ల వ్యర్థాలు ఉంటాయి. వీటిని కార్పొరేషన్‌ ద్వారా సేకరిస్తే టన్నుకు రూ.2వేలు చొప్పున రూ.4వేల వరకు సంస్థకు ఆదాయం వస్తుంది. మరోవైపు చేపలు, పందులకు వీటిని ఆహారంగా ఇవ్వడాన్ని నివారించొచ్చు.

- తిరుపతి, ఆంధ్రజ్యోతి

Updated Date - Dec 22 , 2024 | 02:18 AM