ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అప్పుడు ఛార్జీలు పెంచి ఇప్పుడు హడావిడా?

ABN, Publish Date - Dec 28 , 2024 | 12:56 AM

అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిదిసార్లు కరెంటు ఛార్జీలను పెంచి జనాన్ని బాదేసిన వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చేసరికి నిరసనలకు దిగింది

పుంగనూరు ర్యాలీలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి తదితరులు

చిత్తూరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిదిసార్లు కరెంటు ఛార్జీలను పెంచి జనాన్ని బాదేసిన వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చేసరికి నిరసనలకు దిగింది.ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురైనా అప్పట్లో పట్టించుకోని వైసీపీ నేతలు శుక్రవారం విద్యుత్‌ కార్యాలయాల వద్ద కరెంటు ఛార్జీలు తగ్గించాలంటూ ధర్నాలు చేశారు. జగన్‌ హయాంలోనే ఎడాపెడా విద్యుత్తు కొనుగోళ్లు చేయడంతో ఆ భారం ఇప్పుడూ మోయక తప్పడం లేదు. నవంబరు నుంచి 15 నెలల పాటు కరెంటు ఛార్జీలు పెరగనున్నాయి.నిజానికి జగన్‌ అప్పట్లో చేసిన పాపం ఇప్పుడు ప్రజలకు శాపంగా మారింది.కాబట్టే వైసీపీ నాయకుల నిరసనలకు ప్రజా మద్దతు పెద్దగా లభించలేదు. అన్నిచోట్లా ఆ పార్టీ నాయకులు నిరసనల్లో పాల్గొని, విద్యుత్తు అధికారులకు అర్జీలు ఇచ్చారు.పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో డీఈఈ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందించారు. పలమనేరులో జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో.. కార్వేటినగరంలో వైసీపీ ఇన్‌ఛార్జి కృపాలక్ష్మి ఆధ్వర్యంలో.. జిల్లా కేంద్రం చిత్తూరులో విజయానందరెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. ఎ.రంగంపేట క్రాస్‌ నుంచి పూతలపట్టు సబ్‌స్టేషన్‌ వరకు మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. కుప్పంలో జరిగిన ర్యాలీలో కూడా ఆ పార్టీ నాయకులు తప్ప ప్రజలు కనిపించలేదు. పుత్తూరులో రోజా ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ చేశారు.

Updated Date - Dec 28 , 2024 | 12:56 AM