ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TTD: వార్షిక బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం.. ఎన్ని కోట్లంటే?

ABN, Publish Date - Jan 29 , 2024 | 01:57 PM

Andhrapradesh: టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సర బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది.

తిరుమల, జనవరి 29: టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD Chiarman Bhumana Karunakar Reddy) అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సర బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.5141.74 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోద ముద్ర పడింది. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులకు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం లభించింది.

అలాగే లడ్డు ట్రే మోసే కార్మికుల వేతనాలు రూ.15 వేలు అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వేద పాఠశాలల్లో 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలు రూ.34 వేల నుంచి రూ.54 వేలకు పెంచాలని నిర్ణయించారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 ఆలయాల్లో పని చేసేందుకు నూతనంగా పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. 3, 4, 5వ తేదీల్లో ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ తెలిపారు. 57 మంది మఠ, పీఠాధిపతులు హాజరువుతున్నారన్నారు. వారి సలహాలు, సూచనలను స్వీకరించి అమలు చేస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.


మరిన్ని టీటీడీ పాలకమండలి నిర్ణయాలు ఇవే...

  • స్విమ్స్ అస్పత్రిలో 300 పడకల నుంచి 1200 పడకల పెంపుకు రూ.148 కోట్లతో టెండర్ ఆమోదం..

  • రూ.2.5 కోట్లతో సప్తగిరి సత్రాల్లో అభివృద్ధి పనులు..

  • ఎస్ఎంసీతో పాటు పలు కాటేజీల ఆధునీకరణకు రూ.10 కోట్లు మంజూరు.

  • టీటీడీలో ఒరాకిల్ ఫ్యూషన్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ వినియోగానికి ఆమోదం.

  • అన్నమయ్య భవన్ ఆధునీకరణకు రూ.1.47 కోట్లు కేటాయింపు.

టీటీడీ 2024-25 వార్షిక బడ్జెటుకు రాబడి వివరాలు...

  • హుండీ ఆదాయం రూ.1611 కోట్ల అంచనా..

  • బ్యాంకు డిపాజిట్ల వడ్డీల ద్వారా రూ.1068.51 కోట్ల అంచనా..

  • లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.550 కోట్లు..

  • దర్శన టికెట్ల విక్రయాల ద్వారా రూ.468 కోట్ల అంచనా..

  • గదుల వసతి సౌకర్యం ద్వారా రూ.142 కోట్లు..

  • పుస్తకాల విక్రయాల ద్వారా రూ.35.25 కోట్లు..

  • అగర్బత్తి, టోల్ గేట్, విద్య కళాశాల ద్వారా రూ.74.50 కోట్లు..

  • కళ్యాణ కట్ట ద్వారా రూ.226.50 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు.

Updated Date - Jan 29 , 2024 | 02:11 PM

Advertising
Advertising