ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD New Chairman BR Naidu: ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం

ABN, Publish Date - Nov 06 , 2024 | 06:00 PM

తిరుమల నూతన పాలకమండలి నేడు కొలువు దీరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ.. రాబోవు పాలకమండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

TTD New Chairman BR Naidu

TTD New Chairman BR Naidu: తిరుమల నూతన పాలకమండలి నేడు కొలువు దీరింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ.. తమకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పాలకమండలి ముందు చాలా సవాళ్లు ఉన్నాయన్నారు. రాబోవు పాలకమండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. తిరుమల పవిత్రను కాపాడే విదంగా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.


చర్యలు తీసుకుంటాం..

సామాన్య భక్తులకు త్వరగతిన దర్శనం కల్పించే విదంగా చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. శ్రీవాణి ట్రస్టు నుంచి నిధులు దారి మళ్ళాయని ప్రజల్లో అపోహ ఉందని.. శ్రీవాణి ట్రస్టు నిధుల మల్లింపుపై విజిలేన్స్ నివేదిక వచ్చిన అనంతరం ట్రస్టు కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలోనే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు.


ఉపేక్షించం:

తిరుమలలో అన్యమత ప్రచార నిర్వహణని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని తేల్చి చెప్పారు. అన్యమత ఉద్యోగులు కొనసాగింపుపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎం ఆదేశాలు మేరకు టీటీడీలో ఇప్పటికే ప్రక్షాళన మొదలైందని వెల్లడించారు. ఆస్పత్రుల నిర్వహణ టీటీడీకి భారంగా మారిందని చెప్పుకొచ్చారు.


Also Read:

పల్లె వాసులను కలవరపెడుతున్న విష సర్పాలు

టీటీడీ చైర్మన్‌గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు ప్రమాణం

ఎవడబ్బ సొత్తని అరబిందోకు దోచిపెట్టారు

For More Telugu and National News

Updated Date - Nov 06 , 2024 | 06:00 PM