Alcohol: ‘లాటరీ’ కిక్కెవరికో?
ABN, Publish Date - Oct 12 , 2024 | 01:40 AM
మద్యం దుకాణాలకు దరఖాస్తుల పర్వం ముగిసింది. 104 మద్యం దుకాణాలకు 2241 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.44.82 కోట్ల ఆదాయం వచ్చింది.
ప్రభుత్వానికి రూ.44.82 కోట్ల ఆదాయం
చిత్తూరు సిటీ, అక్టోబరు 11 : మద్యం దుకాణాలకు దరఖాస్తుల పర్వం ముగిసింది. 104 మద్యం దుకాణాలకు 2241 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.44.82 కోట్ల ఆదాయం వచ్చింది.రాష్ట్ర సరిహద్దులోని మద్యం దుకాణాలకు దరఖాస్తులు పోటెత్తాయి. అత్యధికంగా పాలసముద్రం మండలానికి కేటాయించిన ఒకే ఒక్క మద్యం దుకాణానికి 82 దరఖాస్తులు వచ్చాయి. గుడిపాల మండలంలో రెండు దుకాణాలకు 36, 32, యాదమరి మండలంలో మూడు దుకాణాలకు 27, 43, 27, వెదురుకుప్పం మండలంలో రెండు దుకాణాలకు 37, 34, విజయపురం మండలంలో 4 దుకాణాలకు 33,28,35,28 దరఖాస్తులు, కుప్పంలో 5 దుకాణాలకు 31,32,37,31,35 దరఖాస్తులు, గుడుపల్లెలో ఒక దుకాణానికి 40 దరఖాస్తులు వచ్చాయి. 14వ తేదీన లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు జరగనుంది. చిత్తూరు - కాణిపాకం రోడ్డులోని సంతపేటలో ఉన్న ఆర్‌ఆర్ గార్డెన్స్ (మాణిక్యమ్మ ఫంక్షన్ హాల్)లో 14వ తేది ఉదయం 8 గంటలకు లాటరీ నిర్వహిస్తారు. దరఖాస్తుదారులు ఉదయం 7 గంటలకు వేదిక వద్దకు చేరుకోవాల్సి వుంటుంది.లాటరీలో లైసెన్స్ దక్కించుకున్న వ్యాపారులు సంవత్సరంలో 6 విడతలుగా లైసెన్స్ ఫీజును కట్టుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఒక్కరోజు వ్యవధిలో మొదటి విడత లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఆ వెంటనే 16వ తేదీ నుంచి మద్యం దుకాణాలు తెరుచుకుంటాయి. లైసెన్స్ గడువు రెండు సంవత్సరాలుగా నిర్ణయించారు. రెండో సంవత్సరం లైసెన్స్ ఫీజులో 10 శాతం అదనంగా కట్టాల్సి ఉంటుంది.
నియోజకవర్గం మద్యం దరఖాస్తులు సగటు
దుకాణాలు
చిత్తూరు 16 424 26.5
జీడీనెల్లూరు 14 416 29.7
పూతలపట్టు 19 464 24.4
పుంగనూరు 19 202 10.6
పలమనేరు 15 195 13
కుప్పం 10 320 32
నగరి 11 220 20
మొత్తం 104 2241 21.54
Updated Date - Oct 12 , 2024 | 01:40 AM