ప్రభుత్వ లక్ష్యాలను ఎందుకు పూర్తిచేయలేదు?
ABN, Publish Date - Dec 25 , 2024 | 02:00 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం కోసం అమలుచేసే పథకాల లక్ష్యాలను ప్రైవేటు బ్యాంకర్లు ఎందుకు పూర్తిచేయడం లేదంటూ కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆ బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో జిల్లా బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశం, లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు పంట పెట్టుబడిగా అవసరమైన పంట రుణాలు, స్వల్పకాలిక రుణాలు వంటి రుణాల మంజూర్లలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులంటూ తారతమ్యం లేకుండా అన్ని బ్యాంకులు రుణమంజూర్లలో లక్ష్యాలను పూరిచేయాల్సిందేనని అన్నారు. ప్రైవేటు బ్యాంకులు లక్ష్యాలు పూర్తిచేయడంలో అనాసక్తి చూపడం తగదన్నారు.
ఫ ప్రైవేటు బ్యాంకు కంట్రోలింగ్ అధికారులపై కలెక్టర్ అసహనం
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం కోసం అమలుచేసే పథకాల లక్ష్యాలను ప్రైవేటు బ్యాంకర్లు ఎందుకు పూర్తిచేయడం లేదంటూ కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆ బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో జిల్లా బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశం, లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు పంట పెట్టుబడిగా అవసరమైన పంట రుణాలు, స్వల్పకాలిక రుణాలు వంటి రుణాల మంజూర్లలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులంటూ తారతమ్యం లేకుండా అన్ని బ్యాంకులు రుణమంజూర్లలో లక్ష్యాలను పూరిచేయాల్సిందేనని అన్నారు. ప్రైవేటు బ్యాంకులు లక్ష్యాలు పూర్తిచేయడంలో అనాసక్తి చూపడం తగదన్నారు. మిగిలిన వంద రోజుల్లో రైతులకు ఇబ్బంది లేకుండా ప్రైవేటు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాల్సిందేనని ఖరాఖండీగా చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులందరికీ రుణాలు పంపిణీ చేయాలన్నారు. ఎల్డీఎం హరీష్ మాట్లాడుతూ 2024-25 వార్షిక రుణప్రణాళికలో భాగంగా సెప్టెంబరు ఆఖరి నాటికి రూ.6699 కోట్ల రుణపంపిణీ లక్ష్యం కాగా, లక్ష్యానికి మించి రూ.7654 పంపిణీ జరిగిందన్నారు. వ్యవసాయ రంగానికి రూ.5488 కోట్ల లక్ష్యానికి మించి రూ.6284 కోట్లు వితరణ చేశామన్నారు. ఎంఎ్‌సఎంఈలకు రూ.915కోట్లకు గాను రూ.1105 కోట్లు అందజేశామని వివరించారు. బ్యాంకు లింకేజీ ద్వారా ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.472 కోట్లు, మెప్మా ద్వారా రూ.214 కోట్లు అందజేశామని చెప్పారు. ఈ సమావేశంలో నాబార్డు ఏజీఎం సునీల్, డీసీసీబీ సీఈవో మనోహర్ గౌడ్, జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్ రెడ్డి, వివిధ బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 25 , 2024 | 02:00 AM