ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజయ్‌పాల్‌ను 5 రోజులు కస్టడీకి ఇవ్వండి

ABN, Publish Date - Nov 29 , 2024 | 05:18 AM

మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో సీఐడీ విశ్రాంత ఏఎస్పీ ఆర్‌.విజయ్‌పాల్‌ను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని గుంటూరు నగరంపాలెం పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.

గుంటూరు కోర్టులో పోలీసుల పిటిషన్‌

గుంటూరు(లీగల్‌), నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో సీఐడీ విశ్రాంత ఏఎస్పీ ఆర్‌.విజయ్‌పాల్‌ను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని గుంటూరు నగరంపాలెం పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు గుంటూరు స్పెషల్‌ మొబైల్‌ కోర్టులో గురువారం పిటిషన్‌ దాఖలు చేశారు. అరెస్టుకు ముందు 41ఏ నోటీసు అందుకుని తమ ముందు హాజరైన ఆయన.. దర్యాప్తునకు ఏమాత్రం సహకరించలేదని, కేసుకు సంబంధించి ఏ ప్రశ్న అడిగినా తెలియదు.. గుర్తులేదు.. మరచిపోయానంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని పేర్కొన్నారు. రఘురామపై జరిగిన చిత్రహింసలకు ఆ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న విజయ్‌పాలే జవాబివ్వాల్సి ఉందని, దీనిపై ఆయన్ను లోతుగా విచారించాల్సి ఉందని తెలిపారు. పలు వివరాలు రాబట్టాల్సి ఉందని.. కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని, ఇందుకు అనుమతించాలని పోలీసులు తమ పిటిషన్‌లో కోరారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయమివ్వాలని విజయ్‌పాల్‌ తరపు న్యాయవాదులు కోరారు. కోర్టు తన నిర్ణయాన్ని శుక్రవారం వెల్లడించే అవకాశం ఉంది.

Updated Date - Nov 29 , 2024 | 05:18 AM