ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: మద్యం సీసాలతో 7వ తరగతి విద్యార్థులు

ABN, Publish Date - Jan 04 , 2024 | 09:17 AM

ఏపీలోని ప్రకాశం జిల్లాలోని ఓ ప్రాంతంలో న్యూ ఇయర్ సందర్భంగా 7వ తరగతి విద్యార్థులు మద్యం సీసాలతో కనిపించారు. ఈ సంఘటన డిసెంబర్ 31న జరుగగా అందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఏపీలోని ప్రకాశం జిల్లా(prakasam district)లోని ఓ ప్రాంతంలో న్యూ ఇయర్ సందర్భంగా 7వ తరగతి విద్యార్థులు(students) మద్యం సీసాలతో కనిపించారు. ఈ సంఘటన డిసెంబర్ 31న జరుగగా అందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. వీడియోలో విద్యార్థుల పక్కన బీర్ సీసాలు ఉండటంతో స్టూడెంట్స్ ఏమైనా మద్యం సేవించారా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు హాస్టల్ యాజమాన్యం ఏం చేస్తుందని, పట్టించుకోవడం లేదా అని ఇంకొంత మంది కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సమాచారం తెలుసుకున్నారు.


అయితే ఓ వీడియో రీల్ చేసే క్రమంలోనే ఆ వీడియో షూట్ చేసినట్లు అనకాపల్లి పోలీసు సూపరింటెండెంట్(SP) కేవీ మురళీకృష్ణ స్పష్టం చేశారు. అంతేకాదు ఆ క్రమంలో విద్యార్థులు ఎలాంటి మద్యం సేవించలేదని చెప్పారు. దీంతోపాటు విద్యార్థులు కూర్చున్న ప్రాంతం హాస్టల్ భవనం కాదని..దాని పక్కనే ఉన్న నిర్మాణంలో ఉన్న ప్రదేశమని చెప్పారు. ఈ సంఘటన నేపథ్యంలో హాస్టల్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హాస్టల్ పక్కన ఉన్న ఏసీ మెకానిక్, కారు డ్రైవర్ మద్యం సేవించి ఆ పిల్లలతో రీల్స్ చేయించిన క్రమంలోనే ఈ వీడియో షూట్ చేసినట్లు వెల్లడించారు. ఈ అంశంపై కేసు కూడా నమోదు చేయలేదని ఎస్పీ మురళీ కృష్ణ తెలిపారు.

Updated Date - Jan 04 , 2024 | 09:17 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising