ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: రాజధాని నిర్మాణానికి ఇక అన్ని శుభశకునాలే

ABN, Publish Date - Oct 21 , 2024 | 09:38 PM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం రాజధాని అమరావతి ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే రాజధాని అమరావతిలో పున: నిర్మాణ పనులకు శనివారం సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అందులోభాగంగా తుళ్లూరు మండలం ఉద్దరాయునిపాలెంలోని సీఆర్డీయే కార్యాలయం వద్ద భూమి పూజ నిర్వహించారు. దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో మళ్లీ నిర్మాణాలు ఊపందుకొనున్నాయి.

అమరావతి, అక్టోబర్ 21: అమ‌రావతి నిర్మాణానికి నిధులిచ్చేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఏపీసీఆర్డీయేకు రూ. 11 వేల కోట్ల రుణం మంజూరు చేసేందుకు హడ్కో అంగీకారం తెలిపిందన్నారు. అందుకోసం హ‌డ్కో అధికారుల‌తో మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ చర్చలు జరిపారని చెప్పారు.

Also Read: Kesineni Chinni: ఆర్కే రోజాకు ఎంపీ కేశినేని చిన్ని వార్నింగ్


ఇకపై అన్ని శుభశకునాలే..

అయితే అమ‌రావ‌తికి రూ. 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు వ‌ర‌ల్డ్ బ్యాంక్ అంగీకారించిందని తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కంతో రుణాలిచ్చేందుకు బ్యాంకులు, వివిధ సంస్థ‌లు ముందుకొస్తున్నాయన్నారు. నవ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో వేగంగా ముందుకు అడుగులు వేస్తున్నకూట‌మి ప్ర‌భుత్వానికి ఇకపై అన్నీ శుభ‌శ‌కునాలేనని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని అమ‌రావ‌తి ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ సిటీగా రూపుదిద్దాల‌నుకుంటున్నామని సీఎం చంద్ర‌బాబు తెలిపారు.

Also Read: Bihar: డీజీపీకి చేతులు జోడించి.. అభ్యర్థించిన సీఎం


రాజధాని నిర్మాణానికి సీఎం చంద్రబాబు పూజలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం రాజధాని అమరావతి ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే రాజధాని అమరావతిలో పున: నిర్మాణ పనులకు శనివారం సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అందులోభాగంగా తుళ్లూరు మండలం ఉద్దరాయునిపాలెంలోని సీఆర్డీయే కార్యాలయం వద్ద భూమి పూజ నిర్వహించారు. దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో మళ్లీ నిర్మాణాలు ఊపందుకొనున్నాయి.

Also Read: NSTR: నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి సంచారం


జగన్ మూడు రాజధానుల ప్రకటన..

అయితే 2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాలని నిర్ణయిస్తూ అసెంబ్లీ సాక్షిగా సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేశారు. దీంతో రాజధాని అమరావతి కోసం వేలాది ఎకరాలు ఇచ్చిన తుళ్లూరు ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళన బాటపట్టారు. తమ సమస్యలు సీఎం వైఎస్ జగన్‌ను కలిసి చెప్పుకునేందుకు వారంతా ప్రయత్నించారు. కానీ వారికి కనీసం సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు.

Also Read: Konaseema: కోనసీమ జిల్లాలో పాస్టర్ ఘరానా మోసం


రైతుల పాదయాత్రలకు అడ్డంకులు..

దీంతో వారంతా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఆ క్రమంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు, అలాగే అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్రలు చేపట్టారు. ఆ యాత్రలకు సైతం గత ప్రభుత్వం తీవ్ర అడ్డంకులు సృష్టించింది. మరోవైపు మూడు రాజధానుల ప్రకటన చేసి సీఎం వైఎస్ జగన్.. ఆయా ప్రాంతాల్లో ఒక్క ఇటుకరాయి సైతం వేసి.. ఒక్క నిర్మాణాన్ని సైతం చేపట్టలేదు.

Also Read: Pawan Kalyan: ఉత్తరాంధ్రలో బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Also Read: సీమ చింతకాయలు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


మళ్లీ ఎన్నికలు.. జగన్ పార్టీకి గట్టి దెబ్బ

ఇంతలో ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు కూటమికి పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం కొలువు తీరింది. అంతేకాదు.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు సైతం మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు తరలి వస్తున్నాయి. అందుకు ఉదాహరణ లులు గ్రూప్. విశాఖపట్నంతోపాటు విజయవాడ, తిరుపతిలో సైతం భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Also Read: Telangana MLA: తిరుమలలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Oct 21 , 2024 | 09:53 PM