ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

12న విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల

ABN, Publish Date - Nov 30 , 2024 | 03:53 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని 2047 నాటికి అన్ని రంగాల్లో నంబర్‌ 1గా నిలపడం కోసం సిద్ధం చేస్తున్న విజన్‌ డాక్యుమెంట్‌పై సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

స్వర్ణాంధ్ర విజన్‌-2047పై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష డాక్యుమెంట్‌ రూపకల్పనకు పలువురి సూచనలు.. పది సూత్రాలు ప్రకటించిన ముఖ్యమంత్రి

ఆ లక్ష్యాలను సాధించేలా డాక్యుమెంట్‌లో ప్రణాళికలు

అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని 2047 నాటికి అన్ని రంగాల్లో నంబర్‌ 1గా నిలపడం కోసం సిద్ధం చేస్తున్న విజన్‌ డాక్యుమెంట్‌పై సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్‌-2047 ముసాయిదా డాక్యుమెంట్‌ను ఇటీవల అసెంబ్లీ సమావేశాల ద్వారా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది. నీతి ఆయోగ్‌తో పాటు పలు ప్రతిష్ఠాత్మక సంస్థల భాగస్వామ్యంతో ఆ విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిపుణులు, వివిధ ఏజెన్సీలు, మేధావులతో పాటు 17 లక్షల మంది ప్రజల నుంచి విజన్‌ డాక్యుమెంట్‌పై సూచనలు, సలహాలు తీసుకొన్నారు. అందరి అభిప్రాయాలు, ఆలోచనలను పరిశీలించి పరిగణనలోకి తీసుకుని రూపొందించిన విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. స్వర్ణాంధ్ర విజన్‌- 2047 డాక్యుమెంట్‌ను డిసెంబరు 12న విద్యార్థులు, సామాన్య ప్రజల సమక్షంలో ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ డాక్యుమెంట్‌కు సంబంధించి సీఎం చంద్రబాబు ఇప్పటికే 10 సూత్రాలను ప్రకటించారు. పేదరికం లేని సమాజం, ఉపాధి కల్పన, నైపుణ్యం-మానవవనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయంలో సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు-బ్రాండింగ్‌, స్వచ్ఛాంధ్ర, డీప్‌టెక్‌ అనే ఆ సూత్రాలు, వాటి లక్ష్యాలను సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో వివరించారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపైనా స్పష్టంగా విజన్‌ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. రాష్ట్రంతో పాటు జిల్లా, నియోజకవర్గం, మండలస్థాయి వరకు అభివృద్ధి కోసం విజన్‌ డాక్యుమెంట్‌ సిద్ధం చేస్తున్నారు.

Updated Date - Nov 30 , 2024 | 03:53 AM