ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ రంగుకు ఎండ్‌‘కార్డు’

ABN, Publish Date - Oct 11 , 2024 | 05:44 AM

గత వైసీపీ ప్రభుత్వం ప్రచార పిచ్చితో రేషన్‌ కార్డులను కూడా తమ పార్టీ రంగులతోనే నింపేసింది. వాటిపై ఒకవైపు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మరోవైపు జగన్‌ బొమ్మలు ముద్రించి లబ్ధిదారులకు పంపిణీ చేసింది.

  • రాష్ట్రంలో మారనున్న రేషన్‌ కార్డుల ముఖచిత్రం

  • జగన్‌ బొమ్మ, పార్టీ రంగు తొలగించి కొత్త కార్డుల పంపిణీకి కసరత్తు

అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం ప్రచార పిచ్చితో రేషన్‌ కార్డులను కూడా తమ పార్టీ రంగులతోనే నింపేసింది. వాటిపై ఒకవైపు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మరోవైపు జగన్‌ బొమ్మలు ముద్రించి లబ్ధిదారులకు పంపిణీ చేసింది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఆ కార్డులపైనే రేషన్‌ సరుకులు సరఫరా చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాత రేషన్‌కార్డులను తొలగించి కొత్త కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రేషన్‌కార్డుల రూపకల్పనపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కసరత్తు చేస్తోంది.

ఇందుకోసం అధికారులు పలు డిజైన్లు పరిశీలిస్తున్నారు. లేత పసుపు రంగుతో, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం ముద్రించిన కార్డుల నమూనాను అధికారులు ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదించారు. దాంతోపాటు మరికొన్ని నమూనాలను కూడా ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ‘వన్‌ నేషన్‌ - వన్‌ రేషన్‌ కార్డు’ నినాదంతో జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా అమలు చేస్తున్న స్మార్ట్‌ కార్డులు జారీ చేస్తున్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డుల వల్ల వలస కార్మికులు, కుటుంబాలు దేశంలో ఎక్కడైనా రేషన్‌ సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ రేషన్‌కార్డుల జారీపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


  • పెండింగ్‌లో లక్షల దరఖాస్తులు

వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 జూన్‌ నాటికి రాష్ట్రంలో 1,47,33,044 రేషన్‌ కార్డులున్నాయి. వాటిలో 89లక్షల కార్డులనే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత పథకం (ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏ) కింద గుర్తించింది. వాటికే రాయితీ ఇస్తోంది. మిగిలిన కార్డులపై సరఫరా చేసే రేషన్‌ సరుకులకు ఇచ్చే సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. అయితే రాష్ట్రంలో అర్హులైనవారు దరఖాస్తు చేసుకుంటే ఐదు రోజుల్లోనే కొత్త కార్డులు మంజూరు చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. తర్వాత మరో అడుగు ముందుకేసి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెండున్నర గంటల్లోనే ఇప్పిస్తామని చెప్పిం ది. ఆ తర్వాత కొత్త కార్డుల జారీకి ఆరు సూత్రాల మూల్యాంకనం పేరుతో మెలిక పెట్టింది. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్‌ కార్డులు ఉండగా.. వైసీపీ ప్రభుత్వం గత జూన్‌లో అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1.48 కోట్ల కార్డులు ఉన్నాయి. అంటే గత ఐదేళ్లలో పెరిగిన కార్డులు లక్షే.

  • అంత్యోదయ కార్డులపైనా కసరత్తు

రాష్ట్రంలో 1,36,420 మంది ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏ కార్డుదారులు, మరో 17,941 మంది అంత్యోదయ అన్న యోజన కార్డుదారులు కలిపి మొత్తం 1,44,361 కార్డుదారులు 6 నెలలుగా రేషన్‌ తీసుకోవడం లేదు. ఈ కార్డులను రద్దు చేసి.. వాటిని స్టేట్‌ కార్డులుగా మారిస్తే రూ.90 కోట్లు ఆదా అవుతుందని లెక్క తేల్చారు. పైగా ఆరు నెలలుగా రేషన్‌ తీసుకోని కార్డులను రద్దు చేసి.. వాటి స్థానంలో కొత్త వారికి కార్డులిస్తే 2,10,823 మందికి లబ్ధి చేకూరుతుందని నివేదించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

  • నూతన దంపతులకు కొత్త కార్డులు

గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన దరఖాస్తులన్నింటినీ పునఃపరిశీలించి అర్హులైనవారికి, ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలకు కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేయాలని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నూతన దంపతులకు కొత్త కార్డులు ఇవ్వాలంటే ముందుగా వారి కుటుంబ రేషన్‌ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. కొత్త కార్డుల జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు పౌరసరఫరాలశాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు.

Updated Date - Oct 11 , 2024 | 05:44 AM