AP Assembly: గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు.. ఏ అంశంపై అంటే?
ABN, Publish Date - Feb 05 , 2024 | 10:55 AM
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. అయితే గవర్నర్ ప్రసంగంలో చెప్పిన ఓ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళన పరిస్థితి నెలకొంది.
అమరావతి, ఫిబ్రవరి 5: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session) మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) ప్రసంగిస్తున్నారు. అయితే గవర్నర్ ప్రసంగంలో చెప్పిన ఓ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళన పరిస్థితి నెలకొంది. జగనన్న విద్యా దీవెన క్రింద పూర్తి రీయింబర్స్‌మెంట్ ఇచ్చామని గవర్నర్ చెబుతుండగా టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. పూర్తి రీయింబర్స్‌మెంట్ అంతా అబద్ధమంటూ తెలుగుదేశం సభ్యులు నిరసన తెలిపారు. 17 ప్రభుత్వ ఆసుపత్రులు కొత్తగా పెట్టామని చెబుతుండగా కూడా టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ కాదు... దగా డీఎస్సీ అంటూ ప్రతిపక్షాలు నినాదాలు చేశారు. నాడు నేడు కాదు అంతా అధ్వాన్నమే అంటూ టీడీపీ సభ్యులు నిరసన తెలిపడంతో సభలో కొద్దిసేపు గందరగోళన పరిస్థితి నెలకొంది. అయితే వెంటనే గవర్నర్ కల్పించుకుని ‘‘నాకు త్రోట్ ఇరిటేషన్ ఉంది’’ అని చెప్పడంతో టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గారు. ప్రస్తుతం గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.
గవర్నర్ ప్రసంగంలోని అంశాలు...
విజయవడలో 18.8 ఎకరాల్లో 206 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రూ. 404.35 కోట్లతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ విగ్రహం ఏర్పాటు పట్ల సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగిందన్నారు. అల్పాదాయ వర్గాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చే నవరత్నాలు కార్యక్రమం అమలు చేశామన్నారు. విద్యార్ధిని, విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో టాబ్‌లు ఇచ్చామన్నారు. విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా మార్చే కృషి జరుగుతుందన్నారు. ఇంగ్లీష్ మీడియం వలన విద్యార్థులు అంతర్జాతీయంగా పోటీ పడే పరిస్థితి తెచ్చామని గవర్నర్ వెల్లడించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 05 , 2024 | 10:55 AM