AP NEWS: నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ సామాగ్రి వేలంకు కోర్టు ఆదేశాలు
ABN, Publish Date - Mar 12 , 2024 | 10:44 PM
నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ సామాగ్రి వేలంకు నూజివీడు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో చర్చించి వేలాన్ని నిలుపుదల చేసేందుకు నూజివీడు ఆర్డీవో ప్రయత్నాలు చేస్తున్నారు. నూజివీడు జమిందారీ వంశీకులైన మేకా రాజ్యలక్ష్మి తాయారమ్మకు చెందిన స్థలం వేలంలో ఉంది.
ఏలూరు జిల్లా: నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ సామాగ్రి వేలంకు నూజివీడు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో చర్చించి వేలాన్ని నిలుపుదల చేసేందుకు నూజివీడు ఆర్డీవో ప్రయత్నాలు చేస్తున్నారు. నూజివీడు జమిందారీ వంశీకులైన మేకా రాజ్యలక్ష్మి తాయారమ్మకు చెందిన స్థలం వేలంలో ఉంది. 5,960 గజాల భూమిని ప్రభుత్వ కార్యాలయ భవనాల ఏర్పాటుకు 1972లో ప్రభుత్వం ఆక్రమించింది. ఆక్రమణ చేసిన భూమిలో పంచాయతీరాజ్ శాఖ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం భూమికి పరిహారం చెల్లించకుండా అక్రమంగా జిల్లా పరిషత్ కార్యాలయ భవనాల ఏర్పాటు చేశారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని అమ్మకందారులు మేకా సింహాద్రి అప్పారావు ఆశ్రయించారు.గజం వెయ్యి రూపాయల చొప్పున అమ్మకందారునికి రూ. 2కోట్ల 72 లక్షల పరిహారాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
LAOP No 80/ 2002లో జిల్లా కలెక్టర్‌కు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో కేవలం రూ.14 లక్షలు మాత్రమే ప్రభుత్వ అధికారులు చెల్లించారు. మిగిలిన బకాయి చెల్లింపులకు 2002 నుంచి న్యాయస్థానం పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖల అధికారులు సమాధానం ఇవ్వకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఈనెల 22వ తేదీన నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ సామాగ్రి వేలం పాటకు కోర్టు ఆదేశించింది. బాకీ కింద సొమ్మును జమ చేయాలని నూజివీడు కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకు తేల్చిన లెక్కల ప్రకారం రావాల్సిన రూ.17 కోట్ల బకాయికు గానూ 2.68 ఏకరాలల్లో నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ పరిసర ప్రాంగణం ఉంది. ప్రస్తుత భవనాలను వేలం వేసి తమ పరిహారాన్ని ఇప్పించాలని కోరుతూ న్యాయస్థానంలో మరో పిటిషన్ దాఖలైంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 12 , 2024 | 10:44 PM