ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: ఈ సీఎంను కొనసాగించడం అవసరమా?

ABN, Publish Date - Mar 31 , 2024 | 05:12 PM

ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నిప్పులు చెరిగారు. ఆదివారం విజయవాడలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

విజయవాడ, మార్చి31 : ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) నిప్పులు చెరిగారు. ఆదివారం విజయవాడలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజందరు ఈ ప్రభుత్వ బాధితులేనన్నారు. ప్రస్తుతం సీఎం వైయస్ జగన్ వేదికల మీదకు వచ్చి.. నా బీసీలు అంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీసీ అనేది ఆయన పెదాలపై నుంచి వస్తుందే తప్పా.. సీఎం జగన్ గుండెల్లో నుంచి మాత్రం కాదని వ్యంగ్యంగా అన్నారు.

బీసీలపై కనీస సానుభూతి కూడా ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఈ సీఎంను కొనసాగించడం అవసరమా? అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఈ సీఎం వైయస్ జగన్ అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై రెండు లక్షల రూపాయిల అప్పు ఉందని ఈ సందర్బంగా పురందేశ్వరి గుర్తు చేశారు. ఇవి చాలక .. సచివాలయం, రాష్ట్రంలోని గనులను కూడా తనఖా పెడతున్నారని ఆందోళన వ్యక్తం చేశాు. అయితే ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టకూడదని ఎక్కడైనా రాజ్యాంగంలో రాశారా? అంటూ వైసీపీ నాయకుడు అడుగుతున్నారని.. ఇదేం చోద్యమో అర్థం కావడం లేదన్నారు.

ప్రజాధనంతో నిర్మించిన సచివాలయాన్ని తనఖా పెట్టే అధికారం మీకు ఎవరిచ్చారని... ప్రభుత్వ పెద్దలను ఈ సందర్భంగా ఆమె సూటిగా ప్రశ్నించారు. సుపరిపాలన అందిస్తారని ప్రజలు మీకు అధికారం అప్పగించారని.. కానీ అడ్డగోలుగా దోచుకుని ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టమని కాదని ప్రభుత్వ పెద్దలకు హితవు చెప్పారు. ప్రతిపక్ష నేతగా మద్య నియంత్రణ అన్నవారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని ఏరులై పారిస్తున్నారంటూ మండిపడ్డారు.

వైసిపి నాయకుల ధన దాహానికి మహిళలు వితంతువులుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు తండ్రి లేని‌వారిగా మార్చడమే కాకుండా... పేదల బతుకులు‌ సైతం నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లేని మద్యం వల్లే లక్షలాది మంది ఆస్పత్రులు పాలైనట్లు అనేక మంది వైద్యులు నిర్ధారించారని గుర్తు చేశారు. ఈ ఛిద్రమైన‌ జీవితాలకు ఎవరు సమాధానం చెబుతారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం చేసిన మోసాలు, జరిగిన అవినీతిని ప్రజలకు వివరిస్తామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీకి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.

మరిన్నీ ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Andhra Pradesh 2024: నోరు అదుపులో పెట్టుకోండి.. నేనేంటో చూపిస్తా కొడకల్లారా..

AP Elections: ఏపీలో పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన

Updated Date - Mar 31 , 2024 | 05:13 PM

Advertising
Advertising